Indian Economy Analysis: భారత్ ఆర్థికకంగా ఎదుగుతున్న దేశం.. ఒకప్పుడు వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న దేశం ఇప్పుడు పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందింది. ఐటీ ఎగుమతులు లక్షల కోట్లకు చేరాయి. దీంతో లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. కానీ ఆర్థిక అసమానతలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. దేశంలో 40 శాతం సంపద ఇప్పటికీ 1 శాతం సంపన్నుల వద్ద ఉండడమే ఇందుకు నిదర్శనం. మన దేశాన్ని బ్రిటిష్ వాళ్లు పాలించినప్పుడు కూడా ఇంతలా ఆర్థిక అసమానతలు లేవంటున్నారు విశ్లేషకులు.
Also Read: ఆ ఒక్క మాటతో పవన్, బాలయ్యల నోళ్లు మూయించిన రోజా..పంచ్ అదుర్స్
ఆర్థిక అసమానతలు ఇలా..
భారతదేశంలో ఆర్థిక అసమానతలు గణనీయంగా పెరిగాయి. సంపన్న వర్గం, సామాన్య ప్రజల మధ్య ఆదాయం, సంపద విభజనలో భారీ అంతరం ఏర్పడింది. దేశంలో 1% సంపన్నులు దాదాపు 40% సంపదను నియంత్రిస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవస్థలో అసమానతలు ఎంత తీవ్రంగా ఉన్నాయో సూచిస్తుంది. ఆర్థిక అసమానతను కొలిచే జినిపకారం.. భారతదేశంలో ఆర్థిక అసమానతలు 1990వ దశకం నుంచి క్రమంగా పెరుగుతున్నాయి. 2010లో ఈ సూచీ 0.33 ఉండగా, ఇటీవలి అంచనాల ప్రకారం ఇది 0.36కి చేరింది, ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం, 2011–12లో 27.1% ఉన్న తీవ్ర పేదరిక రేటు 2022–23 నాటికి 5.3%కి తగ్గినప్పటికీ, సంపన్న వర్గాల ఆదాయం గణనీయంగా పెరిగింది. పేదరికం ఇంకా సమస్యగా మిగిలిపోయింది.
ఆర్థిక అసమానతలకు కారణాలు..
భారతదేశంలో ఆర్థిక అసమానతలకు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. వేగవంతమైన జనాభా పెరుగుదల ప్రధాన కారణం. ఇది ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోంది. నిరుద్యోగంతో యువతలో, ఆర్థిక అసమానతలను పెంచుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమలు క్షీణించడం, పారిశ్రామికీకరణతో గ్రామీణ–పట్టణ ఆదాయ అంతరం పెరిగింది. 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణ విధానాలు ఆర్థిక వృద్ధిని పెంచినప్పటికీ, సంపద పంపిణీ అసమానంగా జరిగింది. సంపన్న వర్గాలు, పట్టణ ప్రాంతాలు ఎక్కువ ప్రయోజనం పొందాయి. విద్యా అవకాశాలు, నైపుణ్య శిక్షణలో అసమానతలు ఆర్థిక అసమానతలకు దోహదం చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని సంపన్న వర్గాలు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలను పొందుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని పేద వర్గాలకు ఇవి అందుబాటులో లేవు. స్త్రీ, పురుష వివక్ష, కుల వివక్ష వంటివి కూడా ఆర్థిక అసమానతలకు కారణం.
Also Read: కలసిరాని కమ్ బ్యాక్.. రవితేజకు జరిగిందే నితిన్ కి కూడా!
ప్రభుత్వ విధానాలు, అవినీతి..
ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి
ప్రభుత్వ పథకాలు పేదరిక నిర్మూలనకు దోహదపడినప్పటికీ, అవినీతి, అసమర్థ అమలు వలన ఈ పథకాల ప్రయోజనం అందరికీ సమానంగా చేరడం లేదు. పన్ను విధానాలు, సబ్సిడీలు తరచూ సంపన్న వర్గాలకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వం, సమాజం కలిసి పనిచేస్తేనే ఈ అసమానతలను తగ్గించి, సమతుల్య ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది.