Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 22న బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తరభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మిథునం, కర్కాటకం రాశుల వారికి శుభయోగాలు జరగనున్నాయి. అలాగే 12 రాశుల వివరాలు ఎలా ఉన్నాయంటే?
మేషరాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని వ్యాధులు దరి చేరవచ్చు. కుటుంబంలో చిన్న పిల్లలతో సరదాగా గడుపుతారు. సమయం వృథా చేయకుండా అవసరమైన పనులకే వాడుకోవాలి.
వృషభం:
ఒక సమాచారం సంతోషాన్ని ఇస్తుంది. పనుల్లో ఒత్తిడికి గురికావొద్దు. ఉద్యోగులు ఇతరులను నమ్మే విషయంలో ఆలోచించాలి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం.
మిథునం:
శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. వైవాహిక జీవితం వారు మానసిక ప్రశాంతత పొందుతారు. సాయంత్రం ఇతరులకు సాయం చేస్తారు.
కర్కాటకం:
ఆస్తుల విషయంలో వివాదాలు ఏర్పడే అవకాశం. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో నిమగ్నమవుతారు. ఏదైనా సమస్య వస్తే కుటుంబ సభ్యులతో చర్చించండి.
సింహం:
పెండింగు పనులను పూర్తి చేస్తారు. ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఉద్యోగులు అన్ని పనులు పూర్తి చేస్తారు. సాయంతం అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.
కన్య:
వివాహితులు సంతోషంగా గడుపుతారు. స్థిరాస్తిని కొనుగోలు చేయడానికి సిద్ధమైతేపత్రాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం.
తుల:
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో నిమగ్రమవుతారు. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరిస్తారు.
వృశ్చికం:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగు పనులు పూర్తవుతాయి. విహార యాత్రకు వెల్లేందుకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు మొదలుపెడుతారు.
ధనస్సు:
జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురికావొచ్చు. శత్రువులు మీపై ఆధిపత్యానికి యత్నిస్తారు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం. రాజకీయ రంగాల్లో ఉండేవారికి ప్రశంసలు అందుతాయి.
మకరం:
ప్రభుత్వ ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. పరిసర ప్రాంతాల్లో వివాదాలు ఏర్పడితే చాకచక్యంగా వ్యవహరించాలి. భవిష్యత్ కోసం పెట్టుబడులు పెడుతారు.
కుంభం:
కొన్ని శుభవార్తలు వింటారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందుతారు. వివాహం చేసుకోవాలనుకునేవారికి సంబంధాలు వస్తాయి.
మీనం:
రుణాలు మంజూరవుతాయి. గతంలో పెట్టిన పెట్టుబడులకు లాభాలు వస్తాయి. తల్లిదండ్రుల సలహా తీసుకుంటే పనులు తొందరగా పూర్తవుతాయి.