Happy Sawan 2024 : సకల శుభాల శ్రావణం.. శివ భక్తుల ముక్తికి మార్గం.. ఈ శ్రావణ మాసంలో శివుడిని ఎలా ఆరాధించాలంటే?

సకల శుభాల శ్రావణం రానే వచ్చింది. సోమవారంతో ప్రారంభమైన ఈ మాసంలో ప్రతీ సోమవారం శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. కార్తీకం శివ రాధనే మాసమే అయినా.. శ్రావణంలోని సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది.

Written By: NARESH, Updated On : July 22, 2024 2:09 pm
Follow us on

Happy Sawan 2024: బోలేనాథ్ అంటే పరమ శివుడు. ఈ సారి (2024) శ్రావణం మాసం శివుడికి ఇష్టమైన సోమవారంతో ప్రారంభం అవుతుంది. శివుడు భోళా శంకరుడు. వరాలు అడిగిన వెంటనే కాదనకుండా ఇస్తాడు. అందుకే దానవులు ఎక్కువగా శివుడి కోసం పూజలు చేస్తారు. సాధారణంగా కార్తీక మాసం శివారాధనలకు అనుకూలం. కానీ శ్రావణంలో ప్రతీ సోమవారం స్వామిని ఆరాధిస్తే మరింత శుభం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఏడాది శ్రావణం సోమవారంతోనే మొదలవుతుంది కాబట్టి ఆలయాలు ఉదయం నుంచి భక్తులతో నిండిపోయాయి. స్వామి వారి శివలింగానికి అభిషేకాలు నిర్వహించారు. దీంతో పాటు భక్తులు పాలు పోసి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. తమ కోరికలను చెప్పుకుంటూ వేడుకున్నారు. ఇప్పుడు కోరిన కోర్కెలు త్వరగా తీరిస్తే.. కార్తీక మాసం వరకు తాము మొక్కుకున్న మొక్కులను తీరుస్తారు. కోరిన కోర్కెలు తీర్చడంలో పరమ శివుడి తర్వాతే ఎవరైనా. శివారాధనకు అంత శక్తి ఉంది కాబట్టే.. దానవులు శివుడిని అరాధించి గొప్ప గొప్ప వరాలు పొందారు.

శ్రావణ మాసం సోమవారం బోలేనాథ్ కు శుభాకాంక్షలకు సంబంధించి కొన్ని కోట్స్, ఎస్ఎంఎస్ చూడండి..

హ్యామీ శ్రవన్ 2024
* అన్ని దు:ఖాలు, సకల బాధలు, సకల రోగాలు దూరం అవుతాయి.. బోలేనాథ్ శ్రావణంలో మేల్కొనడంతోనే..

హ్యాపీ శ్రావణ్
* శివుడు ప్రతీ కణంలో ఉన్నాడు.. ప్రతీ మాటలో ఉన్నాడు.. రాబోయే కాలంలో ఉన్నాడు.. శివుడు ప్రతీ మంచి పనిలో ఉన్నాడు..

శ్రావణ మాసం శుభాకాంక్షలు
* బోలే నాథ్ నీ గుమ్మం దగ్గరికి రండి.. జీవితాన్ని ఆనందంతో నింపండి. జీవితంలో దు:ఖం ఉండదు.. సంతోషం అన్ని చోట్లా వ్యాపిస్తుంది.

శ్రావణ శుభాకాంక్షలు
* సత్యమే శివుడు, అనంత శివుడు.. ఆది అంటే శివుడు.. ఓంకార్ అంటే శివుడు.. శివేడు బ్రహ్మ, శివుడే శక్తి, శివుడే విష్ణువు..

మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు
* మనస్సును శివుడి నామంపై లగ్నం చేయండి.. శివుడు మీ పనిలో ఆటంకాలను తొలగిస్తాడు.

హ్యాపీ శ్రావణం
* చేతిలో ఢమరుకం.. మేడలో నల్లటి పాము.. ఆయన లీల అసమానమైనది. ఆయనే బోలేనాథ్ (శివుడు)

* ఓం మీద విశ్వాసం, ఓం మీద నమ్మకం, శివుడు ఓంలో ఉన్నాడు.. లోకమంతా శివుడే ఉన్నాడు.

* బాబా బోలేనాథ్ శ్రావణంలో మేల్కొన్నప్పుడు సకల ధు:ఖాలు.. సకల బాధలు, సకల రోగాలు దూరం అవుతాయి.

* శివుడు కణంలోనూ ఉన్నాడు.. ప్రతీ మాటలోనూ ఉన్నాడు..

* శివుడు మాత్రమే అనంతుని స్తుతి, శివుడి పాదాల చెంత కూర్చుంటే సకల శుభాలు మీ వెంటే..

* మీరు శివనామం మొదలు పెట్టి ఏ పని చేసినా.. ఆ కార్యం పూర్తయ్యే వరకు ఆయన మీ వెంటే ఉంటాడు.

శ్రావణ మాసంలో కవాడియాలు దేశంలోని ప్రసిద్ధ ఘాట్ల నుంచి గంగా జలాలను తీసుకువచ్చి శివుడికి జలాభిషేకం చేస్తారు. హరిద్వార్ లోని హర్ కీ పౌరిలోని బ్రహ్మకుండ్ నుంచి శివుని నీటిని గంగాజలంతో నింపడం ఎంతో శుభప్రదం. ఇలా చేయడం వల్ల భక్తుల కోర్కెలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. హిందూ మతంలో కవాడి యాత్ర అతిపురాతనమైనది. శ్రావణ మాసంలో కవాడి యాత్ర నిర్వహిస్తారు. ఈ సమయంలో, శివ భక్తులు పవిత్ర నదుల నుంచి గంగాజలాన్ని తీసుకువచ్చి శివుడికి సమర్పిస్తారు.

పరుశురాముడు మొదటిసారి గర్ముక్తేశ్వరుడి నీటితో శివునికి జలాభిషేకం చేశాడు. అప్పటి నుంచి కవాడి యాత్ర ప్రారంభమైంది. మరొక నమ్మకం ఏంటంటే.. పాల సముద్రం మథనం సమయంలో శివుడు విషం తీసుకున్నాడు. ఇది అతని శరీరంలో చికాకు కలిగిస్తుంది. కాబట్టి శివుడు జలాభిషేకంతో చల్లగా ఉంటాడు. అతనిలోనే ఉన్న ముల్లోకాలు కూడా చల్లగా ఉంటాయి.