Mahesh Babu Daughter Sitara : మహేష్ బాబు కూతురు సితార ఏం చదువుతోంది? ఎక్కడ చదువుతోంది.. ఇంట్రస్టింగ్ డీటెయిల్స్

. మహేష్ బాబు, నమ్రత దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కుమారుడు గౌతమ్ కాగా..కూతురు సితార. కొడుకు గౌతమ్ ఇప్పటికే మహష్ హీరోగా వచ్చిన నెంబర్ 1 మూవీలో కనిపించాడు. ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టాడు. కూతురు సితార మాత్రం ఓ వైపు చదువుతూనే మరోవైపు తండ్రితో కలిసి సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు.

Written By: Srinivas, Updated On : July 22, 2024 1:55 pm
Follow us on

Mahesh Babu Daughter Sitara : తెలుగు సినీ చరిత్రలో ఘట్టమనేని ఫ్యామిలీ స్పెషల్ అని చెప్పవచ్చు. సూపర్ స్టార్ కృష్ట నుంచి ఎంతో మంది నటులు ఆయన ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కృష్ణ కు సమానంగా ఎంతో మంది నటులు వచ్చారు. కానీ తన నటనతో పాటు డైలాగ్ డెలివరీతో కృష్ణ ప్రత్యేక గుర్తింపు సాధించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి రాకముందే ఈస్ట్ మన్ కలర్ లాంటి సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేసిన కృష్ణ కు వారసుడిగా ప్రస్తుతం మహేష్ బాబు సినిమాల్లో కొనసాగుతున్నారు. కృష్ణ తో పాటు.. కృష్ణ తరువాత ఎంతో మంది నటులు వచ్చారు. కానీ బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించారు. రీసెంట్ గా ‘గుంటూరు కారం’ సినిమాతో అలరించారు. ప్రస్తుతం రాజమౌళితో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కూతురు గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల గారాల పట్టి సితార గురించి తెలియని వారు ఉండరు. సితార సినిమాల్లోకి రాకముందే పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో నిత్యం తనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. మహేష్ బాబు సర్కార్ వారి పాట సమయంలో సితార గ్లిమ్స్ రిలీజ్ అయి ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా సితార గురించి ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ లది ప్రేమ వివాహం. వంశీ సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు ఆ తరువాత ముంబైలో పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఒక్కటయ్యారు. అయితే ఆ తరువాత అంతా కలిసి మెలిసి ఉన్నారు. మహేష్ బాబు, నమ్రత దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో కుమారుడు గౌతమ్ కాగా..కూతురు సితార. కొడుకు గౌతమ్ ఇప్పటికే మహష్ హీరోగా వచ్చిన నెంబర్ 1 మూవీలో కనిపించాడు. ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టాడు. కూతురు సితార మాత్రం ఓ వైపు చదువుతూనే మరోవైపు తండ్రితో కలిసి సినీ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలను పెడుతూ మహేష్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

సితార ఇటీవల బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సితారను ఆ ఛానెల్ వాళ్లు కొన్ని ప్రశ్నలు వేశారు. వీటిలో ‘నువ్వు ఏం చదువుకుంటున్నావ్ ’ అని అడిగారు. సాధారణంగా సితార ను చూస్తే ఎంతో పెద్ద అమ్మాయిలా కనిపిస్తారు. ఆమె చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు. సితార హైదరాబాద్ లోని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రస్తుతం 7వ తరగతి చదువుతోంది. కానీ ఆమెను చూస్తే అలా అనిపించడం లేదని కొందరు సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు.

గతంలోనూ పలు విషయాల్లో సితార చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. నువ్వు సినిమాల్లోకి ఎప్పుడోస్తావ్ అని అడగ్గా.. దానికి చాలా సమయం ఉంది అని ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇక బర్త్ డే సందర్భంగా సితార దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. వీటిలో సితారా చాలా వరకు హైట్ ఎక్కువగా ఉన్నట్లు కనిపించారు. మహేష్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన సోషల్ మీడియా ను నమ్రతా శిరోద్కర్ చూస్తుంటారు. ఎప్పటికప్పుడు తమ విషయాలను ఫ్యాన్స్ కు పంచుతూ ఉంటారు.