Devara Movie : ఈ ఒక్కటి చేస్తే దేవర మూవీ కి నష్టం రాదా..? మరి కొరటాల శివ ఎలా ఆలోచిస్తున్నాడు..?

జూనియర్ ఎన్టీయార్ అంటే నటనకు నిలువెత్తు రూపం..వాళ్ల తాత 'నందమూరి తారక రామారావు' అంశ తో పుట్టిన ఎన్టీయార్ నటనకు యావత్ తెలుగు సినిమా ప్రేక్షలందరు ఫిదా అయిపోయారు...

Written By: Gopi, Updated On : July 22, 2024 2:22 pm
Follow us on

Devara Movie :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక నటన పరంగా చూసుకుంటే ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రనైనా చేసి మెప్పించే సత్తా ఉన్న నటులు కొందరు మాత్రమే ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇక నటనపరంగా ఈయన చాలా వరకు కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఆయనే సాటి, ఆయనకి పోటీ ఎవరు లేరు, రారు అనేంతలా తన నట విశ్వరూపాన్ని చూపిస్తుసినిమాలను సక్సెస్ తీరాలకు చేర్చుతాడు..అయితే ప్రస్తుతం ఈయన కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. ఒక స్టార్ హీరో సినిమా సెట్స్ మీద ఉంది అంటే ప్రేక్షకులు ఆ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆరాట పడుతూ ఉండాలి. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం దానికి విరుద్ధంగా జరుగుతోంది. మరి ఎందుకు ఈ సినిమా పబ్లిసిటీలో అంత వీక్ గా కనిపిస్తుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నప్పటికీ సాంగ్ మాత్రం ప్రేక్షకుల్లో ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది. దాని వల్ల కూడా ఈ సినిమా మీద చాలా వరకు అంచనాలు తగ్గాయనే చెప్పాలి. నిజంగా ఈ సినిమా కనుక ఇలానే అంచనాలు లేకుండా ఉంటే మాత్రం ఈ సినిమాకి సక్సెస్ టాక్ వచ్చినప్పటికీ భారీ కలెక్షన్స్ ను వసూలు చేయడంలో మాత్రం వెనుకబడిపోతుందనే చెప్పాలి. ఇక ఈ విషయాన్ని గమనించిన సినిమా యూనిట్ ఇప్పుడు సరికొత్త ప్రమోషన్స్ చేపట్టబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

నిజానికి కొరటాల శివ ఈ సినిమా పట్ల చాలా ఆసక్తిని చూపిస్తున్నాడు. ఎందుకంటే ఈ సినిమా ఆయనకు చాలా ప్రత్యేకమైనది. ఇంతకు ముందు చిరంజీవి తో చేసిన ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివకి ఏ హీరో కూడా డేట్స్ ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్ ధైర్యం చేసి డేట్స్ ఇచ్చాడు. కాబట్టి ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక అందుకే కొరటాల మాత్రం ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాను సక్సెస్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా రైట్స్ విషయంలో చాలా వరకు తర్జన భర్జనలు జరుగుతున్నప్పటికీ కొంతమంది పేర్లు వినిపిస్తున్నప్పటికి మళ్ళీ వాళ్ళు కాదని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని మాత్రం ఎవరు తీసుకున్నారు అనేది ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని భారీ రేంజ్ లో అమ్మేసి ఈ సినిమా మీద హైప్ ను తీసుకురావాలని చూస్తున్నారు.

ఇక సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే మంచిదని మరి కొంతమంది సినీ మేధావులు సైతం దేవర సినిమా యూనిట్ కి సలహాలు ఇస్తున్నారు. ఇక అందులో భాగంగానే కొరటాల శివ కూడా ఈ సినిమా నుంచి మరొక టీజర్ ను రిలీజ్ చేసి సినిమా మీద హైప్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. ఇక మొత్తానికైతే కొరటాల మ్యాజిక్ రిపీట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారనుంది… చూడాలి మరి ఈ సినిమా ఎన్టీయార్ కి, కొరటాల కి ఎలాంటి సక్సెస్ ను ఇస్తుంది అనేది…