Horoscope Today: మనకు పెద్దలు అందించిన జోతిష్య పరిజ్ఞానం ప్రకారం ఇవాళ సూర్యుడు ఏఏ రాశుల్లోకి ప్రవేశిస్తాడు..? ఏనక్షత్ర ప్రభావం ఎలా ఉండబోతోంది..? కొన్ని శుభ యోగాల వల్ల ఏ రాశి వారికి ఇవాళ ఎలా కలిసి రానుంది..? ఎవరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి..? వీటి కారణంగా ఇవాళ పలు రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉండటంతో కొన్ని రాశుల వారి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. బిజినెస్ చేసే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఏ రాశి వారికి ఎలాంటి అధృష్టాలు వరించబోతున్నాయి..? వాళ్లు తీసుకోవల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
=====
01. మేషరాశి..
ఈ రాశి వారికి ఇవాళ మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. పాత బకాయిలు తిరిగి అందుతాయి. వ్యాపారంతో పాటు ఇంట్లోనూ చాలా ప్రశాంతంగా ఉంటారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.
డబ్బు సకాలంలో అందడంతో.. కొంత మొత్తాన్ని పిల్లలపై ఖర్చు చేస్తారు. ఇవాళ మీరు చేసే ఖర్చు విషయంలో మీ భాగస్వామి నుంచి మంచి సపోర్ట్ దక్కుతుంది. డబ్బు విషయంలో కొంత జాగ్రత్త పడినా.. మంచి కార్యక్రమాలకు ఖర్చు చేయడం వల్ల సంతృప్తి దక్కుతుంది
ఇవాళ మేషరాశి వారికి 94 శాతం అదృష్టం కలుగుతుంది.
పరిహారం.. రావి చెట్టుకు పూజ చేయడం వల్ల శుభం కలుగుతుంది.
=====
02. వృషభ రాశి
ఆరోగ్యం విషయంలో ఈ రాశివారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. తీసుకునే ఆహరం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచింది. మద్యం, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. వైద్యుల సలహా మేరకు నడుచుకోవాలి. ఇతరుల వ్యాపారం విషయంలో తల దూర్చకపోవడం మంచిది. మీరిచ్చే సలహాలు అవతలి వారికి ఇవాళ నష్టాన్ని కలిగిస్తుంది. ఇవాళ మీరు కొంత మంది ప్రముఖులను కలిస్తారు. మీ చుట్టుపక్కల జరిగే వివాదాలకు దూరంగా ఉండండి. దాని వల్ల మీరు కష్టాలు ఎదుర్కొంటారు.
ఇవాళ మీకు 76 శాతం మాత్రమే అధృష్లం ఉంది.
పరిహారం.. గోపూజ చేయడం మంచింది
======
03. మిధున రాశి
ఇవాళ మీరు ప్రారంభించే ప్రాజెక్టులు మంచి లాభాలను తీసుకు వస్తాయి. బంధువుల నుంచి కూడా ఆర్థిక సహకారం దక్కుతుంది. భూమి విషయంలో మీరు చేసే ఖర్చు భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకు వస్తాయి. ఒక ముఖ్యమైన విషయం మీ తల్లి దండ్రుల నుంచి తెలుస్తుంది. మీ తండ్రి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు.. చదువు విషయంలో తీసుకునే నిర్ణయాలు కలసి వస్తాయి.
మిధున రాశి వారికి 87 శాతం అదృష్టం ఉంది
పరిహారం… శివార్చన మంచి ఫలితాలనిస్తుంది.
======
04. కర్కాటక రాశి
ఉపాధి విషయంలో కర్కాటక రాశి వారికి బాగా కలసి వస్తుంది. ఫ్యామిలీ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచింది. కుటుంబంతో సాయంత్రం పూట సరదాగా గడుపుతారు. డబ్బుల విషయంలో ఇవాళ బాగా కలసి వస్తుంది. రుణం సులభంగా దొరుకుతుంది. విద్యార్థులు ఏదైనా ఎగ్జామ్‌కు అప్లై చేసుకుంటే.. అందులో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఈ రాశి వారికి 75 శాతం అదృష్టం ఉంది.
పరిహారం.. దాన ధర్మాలు చేయాలి
========
05. సింహ రాశి
ఈ రాశి వారు మతానికి సంబంధించిన శుభకార్యాలకు హాజరుకావచ్చు. దాని వల్ల.. మీకు మంచి విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు ప్రారంభించే వారికి.. ఇవాళ బాగా కలసి వస్తుంది. వ్యాపార భాగస్వామ్యుల నుంచి కూడా సహకారం దొరుకుతుంది. మీ విజయంలో తల్లి దండ్రుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో అన్న దమ్ముల కొనసాగుతున్న గొడవలకు ఇవాళ ఫుల్ స్టాప్ పడుతుంది. ఉద్యోగం విషయంలో మంచి శుభవార్త వింటారు.
ఇవాళ సింహరాశి వారికి 70 శాతం అదృష్టం ఉంది.
పరిహారం.. శివారాధన శుభకరం
=====
06. కన్యారాశి
వ్యాపారం విషయంలో మీకు బాగా కలసి వస్తుంది. బిజినెస్ లాభాలు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడం వల్ల.. మీకున్న రుణాలు తీరిపోతాయి. మీకు రావాల్సిన రుణాలు అన్నీ ఇవాళ తిరిగి అందుతాయి. పెద్దవారి సలహాతో.. మీ కుటుంబ వివాదాలు తొలగిపోతాయి. మీ భాగస్వామి నుంచి మంచి సహకారం దొరుకుతుంది.
ఈ రాశి వారికి 90 శాతం అదృష్టం వరిస్తుంది.
పరిహారం.. పెద్దల ఆశీర్వాదం శుభకరం
=====
07. తులా రాశి
ఇవాళ మీరు చేపట్టే ప్రతీ పనిలో సక్సెస్ అవుతారు. మీకు నచ్చిన పని చేయడం వల్ల.. సంతోషంగా ఉంటారు. పనిచేసే ప్రదేశంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీతో పనిచేసే వారివల్ల.. మీరు కొన్ని సమస్యలు ఎదుర్కుంటారు. దాని వల్ల మీ ఆలోచనా ధోరణి, మాట్లాడే విధానంలో చాలా మార్పులు వస్తాయి. తల్లి దండ్రుల నుంచి ఎదురయిన సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.
ఈ రాశి వారికి 93 శాతం అదృష్టం వరిస్తుంది.
పరిహారం.. వాసుదేవుడి ఆరాధన శుభకరం
=====
08. వృశ్చిక రాశి
ఈ రాశి వారు.. ఇవాళ ప్రారంభించే వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. సహనంతో ఉండటం వల్ల.. చాలా ఇబ్బందుల నుంచి బయటపడతారు. ప్రేమిచిన భాగస్వామని ఫ్యామిలీలోని పెద్దలకు పరిచయం చేస్తారు. తల్లి దండ్రుల నుంచి ఇవాల మన్ననలు పొందుతారు. బిజినెస్ విషయంలో కొత్త వారిని తీసుకునే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. లేక పోతే భవిష్యత్తులో కొన్ని సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
ఈ రాశి వారికి 96 శాతం అదృష్టం వరిస్తుంది.
పరిహారం.. సరస్వతి దేవి ఆరాధన శుభకరం
=====
09. ధనస్సు రాశి
ఇవాళ సహాయం చేసే విషయంలో దనస్సు రాశివారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు చేసే సహాయాన్ని అవతలి వాళ్లు.. స్వార్థంగా భావించే అవకాశం ఉంది. తోటి వారికి సహాయం చేస్తారు. మీరు ప్రారంభించే విషయాల్లో మంచి లాభాలను అందుకుంటారు. బయట దేశాల్లో చదువుకునేవారిని కలసివస్తుంది. పిల్లల వివాహం విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.
ఈ రాశి వారికి 86 శాతం అదృష్టం వరిస్తుంది.
పరిహారం.. రావిచెట్టు పూజ చేయడం శుభకరం
======
10. మకర రాశి
మకరరాశి వారు ఫ్యామిలీ లైఫ్ లో శుభవార్త వింటారు. కొన్ని కారణాల వల్ల ఈ రోజంతా తీరిక లేకుండా గడపాల్సి వస్తుంది. పని విషయంలో.. మీతో పాటు పనిచేసేవారు కొన్ని ఇబ్బందులు కలిగిస్తారు. వాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండండి. మీ లైఫ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవల్సి వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలపై మీ భవిష్యత్తు ఆధారపడుతుంది. వేరే దేశాల్లో ఉంటున్న వారు.. కుటుంబసభ్యుల నుంచి ఒక శుభవార్త వింటారు.
ఈ రాశి వారికి 73 శాతం అదృష్టం వరిస్తుంది.
పరిహారం.. వెంకటేశ్వర స్వామిని పూజించండి
=========
11. కుంభ రాశి
కుంభరాశి వారికి ఇవాళ కొన్ని అనుకోని సమస్యలు ఎదురు అవుతాయి. తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఫ్యామిలీ నుంచి అశుభ వార్త అందుతుంది. ఈ రోజు ఏమి జరిగినా ధైర్యంగా ఉండండి. జాబ్ మారాలి అనుకునే వారికి ఇవాళ అనుకూలంగా ఉంటుంది. స్టూడెంట్స్.. చదువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది.
ఈ రాశి వారికి 80 శాతం అదృష్టం వరిస్తుంది.
పరిహారం.. దాన ధర్మాలు చేయడం శుభకరం
====
12. మీన రాశి
ఇల్లు, వ్యాపారాల విషయంలో.. కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆస్తి సంబంధిత విషయాలు కొంత వరకు కలసి వస్తాయి. డబ్బు విషయంలో జాగ్రత్తలు వహించండి. అప్పు ఇచ్చే టప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. దాని వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. మీ భాగస్వామితో గొడవ జరిగే అవకాశం ఉంది. మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల విషయంలో మీ భాగస్వామి నిర్ణయాలను గౌరవించండి.
ఈ రాశి వారికి 78 శాతం అదృష్టం వరిస్తుంది.
పరిహారం..గాయత్రి ఉపాసనం చేయండి