Homeఆంధ్రప్రదేశ్‌Telugu States Rain Forecast For Six Days: హాట్ సమ్మర్ లో కూల్ న్యూస్.....

Telugu States Rain Forecast For Six Days: హాట్ సమ్మర్ లో కూల్ న్యూస్.. ఏకంగా ఆరు రోజుల పాటు వర్షాలు

Telugu States Rain Forecast For Six Days: తెలుగు రాష్ట్రాలకు చల్లటి వార్త. భారీగా మండుతున్న ఎండల వేళ వాతావరణ శాఖ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అది కూడా ఉరుములతో పాటు మెరుపులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ చెప్పుకొస్తోంది. ఆపై ఈదురు గాలులు కూడా వీస్తాయని చెబుతోంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని.. దీని ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలతో కొంతమేర రిలీఫ్ ద కి అవకాశం కనిపిస్తోంది. ఏకంగా ఆరు రోజులపాటు వర్షాలు అంటే వాతావరణం కూల్ అయ్యే అవకాశం ఉంటుంది.

Also Read: రాజ్యసభ పదవులకు పోటీ.. తెరపైకి కొత్త లెక్కలు!

* సంక్రాంతి తర్వాత ఎండలు..
సంక్రాంతి తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతూ వస్తోంది. మార్చి రెండో వారం నుంచి ఉక్కపోత సైతం ప్రారంభం అయ్యింది. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో వచ్చే ఆరు రోజులు పాటు అంటే ఈనెల 21 వరకు ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. అందుకే అక్కడ కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 21 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని.. తిరిగి ఎండలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.

* ఉత్తరాంధ్రకు భారీ హెచ్చరిక..
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీకి సైతం భారీ వర్ష సూచన ఉంది. ప్రధానంగా ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తో పాటు గోదావరి జిల్లాలకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచన వచ్చింది. ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. చెట్లతో పాటు విద్యుత్ స్తంభాల వద్ద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version