https://oktelugu.com/

Mufasa The Lion King : ది లయన్ కింగ్’ 3 రోజుల తెలుగు వెర్షన్ వసూళ్లు..మహేష్ బాబు వాయిస్ కి కాసుల కనకవర్షం!

హాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం 'ముఫాసా : ది లయన్ కింగ్'.

Written By:
  • Vicky
  • , Updated On : December 23, 2024 / 09:13 AM IST

    Mufasa The Lion King

    Follow us on

    Mufasa The Lion King : హాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రం ‘ముఫాసా : ది లయన్ కింగ్’. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం లోని ముఫాసా క్యారక్టర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఈ చిత్రానికి ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. విడుదల రోజు ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ మహేష్ బాబు అభిమానులతో కిటకిటలాడిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో అభిమానులు స్పెషల్ షోస్ వేసుకొని, సంబరాలు చేసుకున్నారు. మూడేళ్లు మళ్ళీ మహేష్ ని వెండితెర మీద చూసే అదృష్టం ఉండకపోవడంతో, కనీసం ఇలా అయినా ఆనందపడాలనే తపనతో ‘ముఫాసా’ చిత్రాన్ని ఒక పండగ లాగా సెలెబ్రేట్ చేసుకున్నారు. తెలుగు వెర్షన్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము.

    ముందుగా అభిమానులు ఈ చిత్రానికి మొదటి రోజు 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు ప్రచారం చేసారు. అందులో ఎలాంటి నిజం లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు తెలుగు లో కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెండవ రోజు ఏకంగా రెండు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇక మూడవ రోజు అయితే ఈ చిత్రానికి మొదటి రెండు రోజులకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయని సమాచారం. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు రెండు కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఓవరాల్ గా మూడు రోజుల్లో ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. లైవ్ యానిమేషన్ చిత్రం కావడంతో ఈ సినిమాపై చిన్న పిల్లలు అమితాసక్తిని చూపిస్తున్నారు.

    వాళ్ళ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి భారీగా తరళి రావడం కారణంగానే ఈ రేంజ్ వసూళ్లు వస్తున్నట్టు చెప్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ చిత్రానికి ఇండియన్ కరెన్సీ లెక్కల్లో 2000 కోట్ల రూపాయిల గ్రాస్ మూడు రోజుల్లో వచ్చినట్టు చెప్తున్నారు. మొదటి పార్ట్ 2019 వ సంవత్సరం లో విడుదలై మంచి టాక్ ని తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద 1.63 బిలియన్ డాలర్స్ కి పైగా గ్రాస్ ని రాబట్టింది. ఇప్పుడు ‘ముఫాసా’ చిత్రం కచ్చితంగా ఆ రికార్డు ని బద్దలు కొడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు హాలీవుడ్ ట్రేడ్ పండితులు. ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. భవిష్యత్తులో ఎంత రేంజ్ కి వెళ్తుందో చూడాలి. క్రిస్మస్ రోజు ఈ చిత్రం సంచలనాలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.