Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 6న ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. మంగళవారం చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో ఓ రాశి వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. మరో రాశివారు ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
సంబంధాలు మెరుగుపడుతాయి. కెరీర్ పరంగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలి. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది.
వృషభ రాశి:
ఉద్యోగులకు కొన్ని అడ్డంకులు ఏర్పడుతాయి. వ్యాపారుల పెట్టుబడులకు అనుకూలం. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లదంగా ఉంటుంది.
మిథునం:
ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తెలివితేటలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
కర్కాటకం:
శారీరకంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆలోచనా విధానంలో మార్పులు రావొచ్చు.
సింహ:
శుభకార్యాల గురించి చర్చిస్తారు. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనుల కోసం సమయాన్ని వెచ్చిస్తారు.
కన్య:
గతంలో చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు అనుకున్నది సాధించగలుగుతారు. వ్యాపారులు భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని చేసే పెట్టుబడులు లాభిస్తాయి.
తుల:
ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహన ఒప్పందం ఉంటుంది. వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం.
వృశ్చికం:
కొన్ని పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులకు ఊహించని లాభాలోస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కుటుంబంలో గందరగోళ వాతావరణం ఉంటుంది.
ధనస్సు:
కొన్ని ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రియమైన వారితో ఎలాంటి వాదనలకు దిగొద్దు. జీవిత భాగస్వామిని గౌరవించాలి.
మకర:
ఉద్యోగులకు అనుకూలా వాతావరణం. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. కొంచెం శ్రద్ధ వహిస్తే అనుకున్నది సాధిస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి.
కుంభం:
వ్యాపారులు రాణిస్తారు. స్నేహితుల మద్దతు ఉంటుంది. ఎవరితో వాదనలకు దిగకుండా ఉండాలి. కొన్ని వ్యూహాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనుల కోసం బాగా కష్టపడాలి.
మీనం:
కుటుంబ వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల వాతావరణం.