Horoscope Today: గ్రహాల మార్పుతో రాశిఫలాలపై ప్రభావం ఉంటుంది. దీంతో ఆయా రాశులు కలిగిన వారు జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. అలాగే ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశుల వ్యాపారులకు అదనంగా లాభాలు వస్తాయి. మరికొన్ని రాశుల వారికి అనుకోని ఖర్చులు ఉంటాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశి ఫలాలు ఈరోజు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు కొన్ని సమస్యల్లో చిక్కుకుంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి వేధింపులు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో ఖర్చులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. అనుకోకుండా డబ్బు వస్తుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి:
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. ఇదే సమయంలో కొన్ని అదనపు ఖర్చులు కూడా ఉంటాయి. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి:
వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఉద్యోగులు తోటి వారితో సంయమనం పాటించాలి. సీనియర్ల నుంచి ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సింహారాశి:
కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని శుభవార్తలు వింటారు. అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి మార్గం దొరుకుతుంది. బ్యాంకు బ్యాలెన్స్ లో మార్పు ఏర్పడుతుంది.
కన్య రాశి:
ఈ రాశి వారికి ఈరోజు అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వస్తాయి. కొన్ని పనులు రిస్క్ తీసుకుంటే కలిసి వచ్చే అవకాశం ఉంది.
తుల రాశి:
ఆర్థికంగా పుంజుకుంటారు. కొన్ని రోజుల పాటు తప్పుడు పనులకు దూరంగా ఉండాలి. కెరీర్ పై ఫోకస్ చేస్తారు. విద్యార్థులు లక్ష్యాన్ని అధిగమిస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు ఈరోజు ఉల్లాసంగా గడుపుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అనుకోకుండా ఆదాయం సమకూరుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. జీవిత భాగస్వామి కోసం విలువైన బహుమతిని కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి:
ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు.
మకర రాశి:
ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. అయితే భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. వాదనలు ఎక్కువగా చేయొద్దు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి:
ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. కొన్ని రోజుల పాటు వీరు ఏం చేసినా సక్సెస్ అవుతుంది. మనసు ప్రశాంతగా ఉంటుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి మెప్పు పొందుతారు.
మీనరాశి:
ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి.