Bigg Boss Telugu 8: యష్మీ పై నోరు జారిన హరితేజ..స్నేహితురాలి కోసం నిలబడలేకపోయిన ప్రేరణ!

నిన్న టేస్టీ తేజా యష్మీ ని నామినేట్ చేస్తూ 'నువ్వు నీ స్నేహితురాలైన ప్రేరణ ని నామినేట్ చేయాలనీ అనుకున్నావు, ఇప్పుడేమో ఆమె కోసం ఆడుతున్నావు, ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు?, స్నేహం పేరుతో ఆటలు ఆదుకోవడం నాకు నచ్చలేదు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను' అని నామినేట్ చేస్తాడు.

Written By: Vicky, Updated On : October 16, 2024 8:17 am

Bigg Boss Telugu 8(116)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా అడుగుపెట్టిన వారిలో బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ హరితేజ చాలా స్ట్రాంగ్, న్యాయంగా మాట్లాడుతుంది, న్యాయంగానే ప్రవర్తిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఎంత అన్యాయమైన మాటలు మాట్లాడుతుందో, ఎలాంటి దరిద్రమైన కామెంట్స్ చేసి అవతలి వారిని నొచ్చుకునేలా చేస్తుందో నిన్నటి ఎపిసోడ్ తో అర్థం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న టేస్టీ తేజా యష్మీ ని నామినేట్ చేస్తూ ‘నువ్వు నీ స్నేహితురాలైన ప్రేరణ ని నామినేట్ చేయాలనీ అనుకున్నావు, ఇప్పుడేమో ఆమె కోసం ఆడుతున్నావు, ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు?, స్నేహం పేరుతో ఆటలు ఆదుకోవడం నాకు నచ్చలేదు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను’ అని నామినేట్ చేస్తాడు. దీనికి యష్మీ ‘నా దగ్గర ప్రేరణ ని నామినేట్ చేసేందుకు నిజంగా పాయింట్స్ ఉన్నాయి. ఒంటరిగా ఆమె నామినేషన్స్ లోకి వస్తే నేను కచ్చితంగా నామినేట్ చేసేదానిని. కానీ ఇక్కడ ఆమెని ఇద్దరు టార్గెట్ చేసారు, ప్రేరణ ని ఎవ్వరూ సపోర్టు చేయడం లేదు, నాకు అది న్యాయం గా అనిపించలేదు కాబట్టే ఆమె తరుపున ఆడుతున్నాను’ అని అంటుంది.

అలా వాళ్ళ మధ్య వాదనలు పూర్తి అవ్వగా,కిల్లర్ గర్ల్ గా క్యాప్ పట్టుకొని నిల్చున్న హరితేజ మాట్లాడుతూ ‘నబీల్, తేజ చెప్పిన పాయింట్స్ లో, తేజా పాయింట్స్ నాకు చాలా బలంగా అనిపించాయి. ముఖ్యంగా యష్మీ లాంటి స్నేహితురాలు ఎవరికీ ఉండకూడదు అనే నేను కోరుకుంటున్నాను. స్నేహితురాలిని నామినేట్ చేయాలని అనుకోవడం చాలా తప్పు.ఇంత చేసి ఇందాక వచ్చి నువ్వు ఏడిస్తే నేను చూడలేను అని అంటుంది. ఏడిస్తే చూడలేను అని చెప్పుకునే ఆమె నామినేట్ చేసి బయటకి ఎలా పంపాలి అనుకుంది?, ఇప్పుడు ఎందుకు ఆమె తరుపున ఆడుతుంది?, నాకు ఎందుకో ఆమె డ్రామాలు ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది’ అంటూ హరి తేజ నామినేషన్ యష్మీ కి వేస్తుంది. ఇక్కడ ప్రేరణ చేసిన తప్పు ఒకటి ఉంది. యష్మీ ప్రేరణ కి నామినేషన్ వేయాలని అనుకున్న విషయం, స్వయంగా యష్మీ నే ప్రేరణకి చెప్పింది. వాళ్లిద్దరూ దాని గురించి మాట్లాడుకున్నాక ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు, యష్మీ తనకి నామినేషన్ వేసినా పర్వాలేదు అని ప్రేరణ ఒప్పుకుంది. ప్రేరణ దీనిని హరితేజ యష్మీ బోర్డు ని తీసుకొని నామినేషన్స్ లోకి వేసే ముందు చెప్పలేదు. వేసిన తర్వాత చెప్తుంది. హరితేజ యష్మీ ని స్నేహం పేరు తీసి చాలా దారుణమైన మాటలు యష్మీ ని మాట్లాడింది.

అప్పుడే ప్రేరణ కలగచేసుకొని అసలు విషయం ఏమిటో చెప్పుంటే యష్మీ నామినేషన్స్ లోకి వచ్చేది కాదు. ఇదే విషయాన్ని హరితేజ కూడా అంటుంది. ఈ విషయం నాకు ముందే చెప్పుంటే, నా ఆలోచన విధానం వేరేలాగా ఉండేది, యష్మీ బోర్డుని నామినేషన్స్ లో వేసేదానిని కాదు, అంత అయిపోయాక ఇప్పుడు చెప్తున్నావ్ అని ప్రేరణని అంటుంది హరితేజ. ప్రేరణ కావాలని అలా చేసిందో, లేక ఆ సమయంలో ఆమెకి ఏమి మాట్లాడాలో తెలియలేదో జనాలకు అర్థం కాలేదు కానీ, ఇంత జరిగినప్పటికీ కూడా యష్మీ ప్రేరణ కోసం చాలా బలంగా ఆడింది. ఎదో మొక్కుబడిగా ఆమె ఆడలేదు, విష్ణు ప్రియా, పృథ్వీ రాజ్, నయనీ పావని లను ఎదురుకొని ప్రేరణ చేతిలో క్యాప్ పెట్టింది, అంత బలంగా ఆమె తన స్నేహితురాలి కోసం ఒక స్టాండ్ తీసుకుంది.