https://oktelugu.com/

Horoscope Today : ఈ నాలుగు రాశుల వ్యాపారులకు అనుకోని లాభాలు.. ఉద్యోగులకు ప్రశంసలు..

కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. సంయమనం పాటించకుంటే కష్టాలను ఎదుర్కొంటారు. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

Written By:
  • NARESH
  • , Updated On : September 10, 2024 / 08:22 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు ప్రీతి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. మరికొన్ని రాశుల వారు శత్రువుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కుటుంబ సభ్యుల అవసరాలకు డబ్బు ఖర్చు అవుతుంది. జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. స్నేహితుల ద్వారా కొంత ఆదాయం సమకూరుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

    వృషభ రాశి:
    ఈ రాశి వారికి ఈరోజు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయ రంగాల వారికి వివిధ వర్గాల వారి మద్దతు ఉంటుంది. తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు ఉంటాయి.

    మిథున రాశి:
    వ్యాపారులు ఇప్పటికే పెట్టిన పెట్టుబడుల వల్ల అధిక లాభాలు పొందుతారు. ఏదైనా కొత్త ఒప్పందాన్ని చేసుకుంటే అది లాభదాయకం అవుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

    కర్కాటక రాశి:
    ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి. రోజూవారీ అవసరాలకు ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

    సింహారాశి:
    వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల కోసం కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

    కన్య రాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం అదనంగా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ప్రాజెక్టు మొదలు పెడితే అది కలిసి వస్తుంది.

    తుల రాశి:
    సాయంత్రం ఇంటికి అతిథులు వస్తారు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆదాయం సమకూరుతుంది. కుటుంబ సభ్యులంతా బిజీగా ఉంటారు.

    వృశ్చిక రాశి:
    మానసికంగా ధృఢంగా ఉంటారు. భవిష్యత్ కోసం కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. పిల్లల భవిష్యత్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

    ధనస్సు రాశి:
    ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవ్దు. సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

    మకర రాశి:
    విదేశాల్లో వ్యాపారం చేసేవారు కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య చీలికలు వస్తాయి. పెండింగ్ బకాయిలు తిరిగి వస్తాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

    కుంభరాశి:
    భాగస్వామితో ఏదైనా వ్యాపారం చేస్తే అధిక లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కొన్ని విభేదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగులు సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    మీన రాశి:
    కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. సంయమనం పాటించకుంటే కష్టాలను ఎదుర్కొంటారు. వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.