https://oktelugu.com/

Relationship : భాగస్వామిపై అధికంగా కోపం వస్తుందా.. అయితే ఇలా చేయండి

వీటి వల్ల మళ్లీ భాగస్వామికి దగ్గర కాలేరు. కాబట్టి ఎంత కోపాన్ని అయిన తగ్గించుకుంటే.. ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే కారణం లేకుండా భాగస్వామి మీద అధికంగా కోపం వస్తే.. కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేకుండా సంతోషంగా ఉంటారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 10, 2024 / 07:18 AM IST

    Angry with Your Partner

    Follow us on

    Relationship :  కోపం ఎన్నో అనార్ధాలకి కారణం. కొందరు ఎలాంటి కారణం లేకుండా చీటికీ మాటికీ కోపం అవుతుంటారు. ప్రతి చిన్న దానికి కూడా ఇతరుల మీద కోపం అవుతారు. దీనివల్ల బంధాల మధ్య విభేదాలు ఎక్కువగా వస్తాయి. చాలా మంది జంటల్లో ఒకరు నెమ్మదిగా, కూల్ గా ఉంటే ఇంకొకకరు కోపంగా ఉంటారు. కారణం లేకుండా భాగస్వామిపై కోపం అవుతారు. ఆ కోపం వల్ల చిన్న విషయాలకి కూడా గొడవలు పడుతుంటారు. ఎక్కడో ఆగాల్సిన గొడవ అలా పెరిగి పెద్దది అవుతుంది. అయితే కోపం ఎవరి మీద వచ్చిన కంట్రోల్ చేసుకోవాలి. అధిక కోపం వల్ల బంధాలు విడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. చిన్న విషయాలకి భాగస్వామి మీద కోపంగా ఉండి.. గొడవలు పడితే ఒక్కసారిగా నిరాశకు లోనవుతారు. ఉన్న ప్రేమ అంతా పోయి.. కోపమే మిగులుతుంది. కోపం వల్ల ఒత్తిడి ఎక్కువ కావడంతో పాటు.. లైంగిక కోరికలు కూడా తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల మళ్లీ భాగస్వామికి దగ్గర కాలేరు. కాబట్టి ఎంత కోపాన్ని అయిన తగ్గించుకుంటే.. ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే కారణం లేకుండా భాగస్వామి మీద అధికంగా కోపం వస్తే.. కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడు ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేకుండా సంతోషంగా ఉంటారు.

    కోపం అనేది ప్రతిఒక్కరికి ఉంటుంది. బంధంలో ఒకరు కోపంగా ఉంటే.. ఇంకొకరు సైలెంట్ గా ఉండిపోవడం బెటర్. మాటకి మాట పెరిగితే గొడవ పెద్దది అవుతుంది. కాబట్టి ఒకరు కోపంగా ఉంటే ఇంకొకరు తగ్గిపోవాలి. కోపం ఎక్కువగా ఉన్నవాళ్లు.. దేని వల్ల కూల్ అవుతారో ఆ పని చేయాలి. కొందరికి కోపం వస్తే.. కళ్ళుమూసుకుంటారు. ఇలా చేయడం వల్ల కోపం తగ్గుతాదని భావిస్తారు. ఎవరికీ ఏం చేస్తే కోపం తగ్గుతుందో ఆ పని చేయాలి. అలాగే మీ భాగస్వామికి ముందే చెప్పండి. కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేను. కాబట్టి ఆ సమయంలో నువ్వు సైలెంట్ ఉండాలి. మళ్లీ కోపం వచ్చే పని చేయకూడదు అని చెప్పుకోవాలి. అప్పుడు భాగస్వామి అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. కొందరు ఈగోకి పోతారు. గొడవ జరిగిన తరువాత కూడా కనీసం భాగస్వామిని పట్టించుకోరు. తప్పు ఉన్నా క్షమాపణ చేప్పుకోరు. బంధంలో సారీ చాలా ముఖ్యం. ఇది చిన్న పదమే. కానీ వాడితేనే బంధం బలపడుతుంది. ఊరికే కోపం వస్తుంటే.. పాటలు వినడం, డాన్స్ చేయడం, యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. రోజులో ఒక పది నిముషాలు ఒంటరిగా కూర్చుని కోపం ఎందుకు వస్తుందని ఆలోచించండి. అప్పుడు మీలో ఉన్న తప్పు కూడా తెలుస్తుంది. ఇంకోసారి కోపం రాకుండా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే లైఫ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్, భాగస్వామితో కలిసి స్పెండ్ చేసిన టైం వంటివి గుర్తు తెచ్చుకుంటే.. కాస్త కోపం తగ్గుతుంది. ఈసారి కోపం వచ్చినప్పుడు ఈ నియమాలు పాటిస్తే.. తప్పకుండా తగ్గుతుంది.