Bigg Boss Telugu 8: పాపం ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అందరి కంటెస్టెంట్స్ కంటే అమాయకుడిగా అనిపిస్తున్నాడు ఆదిత్య ఓం. హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు ఇతను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తోటి కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆయన బిగ్ బాస్ హౌస్ లో తనదైన మార్కుని వేసుకోలేకపోయాడు. అందరితో కలుస్తున్నాడు కానీ, ఎవరితోనూ పూర్తిగా కలవడం లేదు. చివరికి స్నేహితుడు అనుకున్న శేఖర్ బాషా ని కట్టప్ప లాగా మాటికొస్తే పొడుస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉండగా శనివారం ఎపిసోడ్ లో అక్కినేని నాగార్జున ఆదిత్య ఓం అసలు హౌస్ లో ఉన్నట్టే కనిపించడం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇంట్లో పనులు బాగానే చేస్తున్నావ్ కానీ, నలుగురితో కలవు, సరదాగా మాట్లాడు, హౌస్ మేట్స్ హౌస్ కోసం తీసుకునే నిర్ణయాలలో పాలు పంచుకోమని చెప్పాడు. నాగార్జున సార్ చెప్పాడు కదా అని ఈరోజు నుండి కొత్త ఆదిత్య ని చూస్తారు అందరూ అంటూ సీత కి చెప్తాడు ఆదిత్య. కానీ నామినేషన్స్ లో పాపం ఆయనకీ ఎవరూ దొరకక శేఖర్ బాషా ని ఎంచుకున్నాడు.
శేఖర్ బాషా సరదాగా తీసుకొని ముందుకు వస్తుంటే, ఇది కామెడీ కాదు, దూరం గా వెళ్ళు అని అరిచాడు. ఆ తర్వాత నామినేషన్స్ ని కారణాలు చెప్తూ ‘శేఖర్..నీకు అసలు డిసిప్లిన్ లేదు, బిగ్ బాస్ రూల్స్ ని ఫాలో అవ్వడం తెలీదు, నువ్వు ఇలాంటి రియాలిటీ షో లో ఉండడం కరెక్ట్ కాదు, నువ్వు బిగ్ బాస్ కి అన్ ఫిట్’ అని ముఖం మీదనే చెప్తాడు. అప్పుడు శేఖర్ బాషా హౌస్ లో నేనొక్కడినే కాదు, చాలా మంది రూల్స్ ని ఫాలో అవ్వడం లేదు, కానీ నేను మీకు మాత్రమే స్పెషల్ గా కనిపించాను అంటూ శేఖర్ బాధపడ్డాడు. ఆ తర్వాత శేఖర్ బాషా కూడా ఆదిత్య ఓం ని నామినేట్ చేసాడు. కానీ చివర్లో వీళ్ళ మధ్య జరిగిన చిన్న సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నామినేట్ చేసే సభ్యులు పెయింట్ మీద పోసి చేయాలి అనేది బిగ్ బాస్ రూల్. శేఖర్ బాషా అలా ఆదిత్య ఓం నెత్తి మీద పెయింట్ పోయగానే అతని మొహానికి మొత్తం పెయింట్ అంటుకుంటుంది. అప్పుడు శేఖర్ బాషా గుడ్డ తీసుకొని ఆదిత్య ముఖాన్ని తుడుస్తాడు, అప్పుడు ఆదిత్య ఓం ప్రేమతో శేఖర్ బాషా ని కౌగలించుకొని ముద్దు పెట్టుకుంటాడు. దీనిని బట్టి ఆదిత్య ని ఏమని అర్థం చేసుకోవాలో ఆడియన్స్ కి కూడా అంతు చిక్కలేదు. శేఖర్ బాషా పద్ధతులు నిజంగా ఆయనకీ నచ్చకపోవడం వల్ల నామినేట్ చేశాడా?, లేదా వేరే కంటెస్టెంట్స్ ఎవరికీ ఎలాంటి కారణాలు తన దగ్గర లేకపోవడం వల్ల ఆయన మాటికొస్తే శేఖర్ బాషాని తన నామినేషన్స్ కోసం ఎంచుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది.