https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి అనుకోని ఆదాయం.. వద్దన్నా డబ్బు..

కొపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆదాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పొరపాట్లపై పశ్చాత్తాప పడుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 15, 2025 / 09:01 AM IST

    Horoscope )

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారికి నిరుత్సాహంగా ఉంటుంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : కొపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆదాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అద్భుతమైన అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పొరపాట్లపై పశ్చాత్తాప పడుతారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడుతారు. కొన్ని పనుల వల్ల బిజీగా ఉంటారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులకు ధనలాభం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులు ఆర్థిక వనరులు పొందుతారు. ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు, వ్యాపారులు ఏకకాలంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇంటా, బయట గందరగోళం సృష్టించకుండా ఉండాలి.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతంది. ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. మధ్యాహ్నం వ్యాపార సంబంధ విషయాలపై చర్చిస్తారు. కుటుంబ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆస్తికి సంబంధించిన విషయాల్లో శుభవార్తలు వింటారు. వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. పర్యాటకరంగం వైపు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఇతరులతో సంబంధాలు చెడిపోతాయి.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఆర్థిక లాభాలు ఉంటాయి. కార్యాలయాల్లో సీనియర్ల సపోర్టు ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. అవసరాన్ని భట్టి ఖర్చులు ఉంటాయి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొన్ని పనులు ఆలస్యంగా సాగుతాయి. సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. కొత్త పనిని ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవాలి. వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు. ఇవి లాభిస్తాయి. కొన్ని వర్గాలను అదనపు ఆదాయం సమకూరుతుంది. సంబంధాలు మెరుగుపడుతాయి. వ్యాపారులు ఇబ్బందులకు గురవుతారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కొన్ని కారణాల వల్ల ఇంట్లో విభేదాలు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన పెట్టుబడులు పెడుతారు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులకు ధన సాయం అందుతుంది. అనుకున్న సమయాల్లో పనులు పూర్తి చేయగలుగుతారు. విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పవిత్రమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు అందుతాయి. ఇతరుల ప్రవర్తన వల్ల చికాకు కలుగుతుంది. కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. పాత స్నేహితులను కలుస్తారు.