https://oktelugu.com/

South Africa: బంగారు గనిలో మరణ మృదంగం.. ఆకలితో వంద మందికిపైగా మృతి.. ఎక్కడ అంటే..

బంగారం.. ప్రపంచంలో విలువైన ఖనిజాల్లో ఇది ఒకటి. ఆభరణాలుగా ఉపయోగించే బంగారం ఎక్కువగా దక్షిణాఫ్రికాలోనే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి గనుల నుంచి బంగారం వెలికి తీసి వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే బంగారం వెలికి తీత అంత ఈజీ కాదు. మన దేశంలోని కొలార్‌ గనుల్లోనూ బంగారం ఉత్పత్తి చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : January 15, 2025 / 09:17 AM IST

    South Africa

    Follow us on

    South Africa: ప్రపంచంలో బంగారం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం దక్షిణాప్రికా. ఇక్కడి గనుల ద్వారా బంగారం వెలికి తీస్తారు. బంగారం తవ్వడానికి కార్మికులనే ఉపయోగిస్తుంటారు. వందల అడుగుల లోతుకు వెళ్లి కార్మికుల ప్రాణాలు ఫణంగా పెట్టి పనులు చేస్తారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతోందో తెలియదు. తాజాగా దక్షిణాఫ్రికాలోని ఓ బంగారం గనిలో వంద మంది కార్మికులు మృతిచెందారు. గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరిపేందుకు వెల్లిన వందల మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. రోజుల తరబడి ఆహారం, నీరు లేకపోవడంతో ఆకలితో అక్కడే మరణించారు. వీరిని కాపాడేందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం ససేమిరా అంది. అయితే పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. ఈమేరకు ఓ క్రెయిన్‌ను లోపలికి పంపించింది. అయితే కొన్ని నెలలుగా గనుల్లో చిక్కుకుపోయిన వారిలో దాదాపు వందకుపైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్‌తో మృతిచెందారు.

    అక్రమ మైనింగ్‌ కోసం వెళ్లి..
    బంగారం నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్‌ అక్కడ సాధారణమే. వందల సంఖ్యలో ఉన్న పాడుబడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉంటారు. ఆహారం, నీటితోపాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్తారు. అయితే దక్షిణాఫ్రికా ప్రభుత్వం అక్రమ మైనింగ్‌ను తీవ్రంగా పరిగణిస్తోంది. ఆపరేషన్‌ క్లోజ్‌ ది హోల్‌ను 2023 డిసెంబర్‌లోచేపట్టింది. ఇందులో భాగంగా 13 వేల మందిని అరెస్టు చేసింఇ. దీంతో చాలా మంది చాలా మంది అక్రమ మైనింగ్‌ కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతు ఉండే స్టిల్‌ఫొంటెయిన్‌ గనిలో తలదాచుకున్నారు. అయితే వీరిని బయటకు రప్పించేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు.నీరు, ఆహారం చేరవేసే మార్గాలు మూసివేశారు. దీంతో వందల మంది గనుల్లోనే ఉండిపోయారు.

    ఆకలితో మరణాలు..
    నెలల తరబడి ఆహారం, నీరు అందకపోవడంతో కార్మికులు గనుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే 96 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఆహారం పంపితే బయటకు వస్తామని గనిలో కార్మికుడు రికార్డు చేసిన ఓ వీడియో ఇటీవలే బయటకు వచ్చింది. కార్మికుల దుస్థితి ఆ వీడియోలో ఉంది. దీంతో ఓ కార్మికుడు కుటుంబం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం స్లిల్‌ఫోంటెయిన్‌ బంగారు గనిలో సహాయక చర్యలు చేపట్టింది. జనవరి 10 నుంచి 14 వరకు 35 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. 24 మృతదేహాలు వెలికి తీశారు. 14వ తేదీ ఒక్కరోజే 8 మందిని కాపాడారు. ఆరు మృతదేహాలు బయటకు తీశారు. ఇంకా 500 మంది వరకు గనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో చాలా మంది ఆకలి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గనిలోకి వెళ్లేందుకు ఉంచిన తాళ్లు, కప్పీలను పోలీసులు తొలగించడంతో బయటకు రాలేకపోతున్నామని కార్మికులు పేర్కొంంటున్నారు. హక్కుల సంఘాలు కూడా ఈమేరకు ఆరోపణలు చేస్తున్నాయి. పోలీసులు మాత్రం బయటకు వస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని చాలా మంది గనిలోనే ఉండిపోతున్నారని పోలీసులు పేర్కొంటున్నారు.