https://oktelugu.com/

Horoscope Today: మీ రాశి ఉద్యోగులకు ఈరోజు అనుకోని ఆదాయం..

ఒకేసారి అన్ని పనులు చేయాల్సి రావడంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి లేకుంటే నష్టపోయేది మీరే.

Written By:
  • Srinivas
  • , Updated On : December 10, 2024 / 07:57 AM IST

    Horoscope Today(2)

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పుతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో మంగళవారం ద్వాదశరాసులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదనపు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఉంది మరికొన్ని రాశుల వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకోవాలి. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి: ఈ రాశి వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే భాగస్వాములతో కొన్ని ముఖ్యమైన చర్చలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే ఎవరైనా నష్టపోతారు.

    వృషభరాశి: ఒకేసారి అన్ని పనులు చేయాల్సి రావడంతో ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి లేకుంటే నష్టపోయేది మీరే.

    మిథున రాశి: భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్తపెట్టుబడును పెడతారు. కుటుంబంలో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. సహనంతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు. దీంతో మనసు ప్రశాంతంగా మారుతుంది.

    కర్కాటక రాశి: సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులు తెలివైన నిర్ణయం తీసుకుంటారు. దీంతో భవిష్యత్తులో లాభాలు ఉంటాయి. విలాసాల కోసం డబ్బును ఖర్చు చేస్తారు.

    సింహా రాశి: ఈ రాశి వారు కొన్ని విలువైన వస్తువులను పొందుతారు. దీంతో ఉల్లాసంగా గడుపుతారు. పాత స్నేహితులను కలుస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇతరులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు.

    కన్యరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఏ పని చేపట్టిన విజయమే అవుతుంది. అయితే ముఖ్యమైన పనులను మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే సమయం వృథా అయితే తిరిగి రాదు. సాయంత్రం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    తుల రాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యంగా వహించడం వల్ల నష్టపోతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఉపాధి కోసం చూసేవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అవుతాయి.

    వృశ్చిక రాశి: నగదు ఇచ్చు పుచ్చుకునే వ్యవహారం ఉంటే దాన్ని వాయిదా వేసుకోవాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోయే అవకాశం. అదనపు ఆదాయం కోరుకునే ఉద్యోగులకు అవకాశాలు ఉంటాయి. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు.

    ధనస్సు రాశి: వ్యాపారులు లాభదాయకమైన ఒప్పందాలు చేసుకుంటారు. బంధువులతో ఓ విషయంలో వాగ్వాదం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే బంధువుల తో దూరం పెరుగుతుంది.

    మకర రాశి: పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. విహారయాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.

    కుంభ రాశి: ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

    మీనరాశి: ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొనే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి అతిథులు వచ్చే అవకాశం. దీంతో ఖర్చులు పెరిగే అవకాశం. ఆదాయ వ్యవహారాల్లో కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండాలి.