https://oktelugu.com/

Manchu Manoj : నన్ను కొట్టారు.. చంపేస్తారు.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మంచు మనోజ్ సంచలన విషయాలు…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 08:01 AM IST

    Manchu Manoj

    Follow us on

    Manchu Manoj : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లారు. మరి అలాంటి నటులు వరుస సినిమాలతో ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తున్నారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక అందులో భాగంగానే మోహన్ బాబు లాంటి నటుడు కూడా విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంతు ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు…ఇక ఇది ఏమైనా కూడా ఆయన లాంటి నటులు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి…

    సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక గతంలో ఆయన చేసిన సినిమాలన్నీ వరుస సక్సెస్ లను సాధించడమే కాకుండా ఆయనకంటూ సపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్నాడు. ఆయన లాంటి నటుడు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. అయితే గత కొద్దిరోజుల నుంచి మంచు ఫ్యామిలీలో కొన్ని విభేదాలు అయితే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా మంచు మనోజ్ మీద ఎవరో దాడి చేసిన విషయం అయితే మనకు తెలిసిందే. ఇక దానికి తగ్గట్టుగానే ఈరోజు మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్ కి వచ్చి తన మీద దాడి చేసిన వాళ్ల మీద ఫిర్యాదు చేశారు…ఎవరో గుర్తు తెలియని 10 మంది వ్యక్తులు అతని మీద దాడి చేశారంటూ ఆయన ఫిర్యాదులో తెలిపినట్టుగా సీఐ తెలియజేశారు. ఇక విజయ్, కిరణ్ అనే వ్యక్తులు సీసీటీవీ పుటేజ్ తీసుకెళ్లినట్టుగా కూడా తెలియజేశాడు. మరి ఆయన ఫిర్యాదు లో తనకు ప్రాణహాని ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రస్తావనను అసలు తీసుకురాలేదు.

    మరి అందుతున్న సమాచారం ప్రకారం అయితే మంచు మనోజ్ మీద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఆ వ్యక్తులు ఎవరు ఎందుకోసం ఆయన మీద దాడి చేశారనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి ఫిర్యాదులు ఇవ్వడం ఇప్పుడూ హాట్ టాపిక్ గా మారింది.

    మరి తనదైన రీతిలో గుర్తింపు సంపాదించుకొని ఒకప్పుడు మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఇలాంటి వార్తల్లో నిలవడం అందులోను వివాదాల బాట పట్టడం అనేది ఇప్పుడు కొంతమందికి జీర్ణించుకోలేని విషయమనే చెప్పాలి. ఇక ఇది ఏమైనా కూడా మంచు ఫ్యామిలీలో గొడవలైతే జరుగుతున్నాయి.

    మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావాలనే మంచు మనోజ్ మీద అటాక్ చేయించారా? లేదా ఇండివిడ్యూయల్ గా ఎవరైనా అతని మీద కక్ష కట్టి ఇలా చేస్తున్నారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటి వరకైతే మోహన్ బాబు ఫ్యామిలీ ఎప్పుడు ఇంతలా వివాదాల బాటపట్టలేదు…మరి ఈ గొడవను తొందరగానే సద్దుమనిగేలా చేస్తారా లేదా అనేది చూడాలి…