https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారులు అద్భుత అవకాశాలు పొందుతారు..

కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఆహ్లదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. వివాహితులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : November 12, 2024 / 08:16 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల ఫలితాల్లో మార్పులు ఉంటాయి. మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. అలాగే ఈరోజు సర్వార్థ సిద్ధియోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేస్తే జాగ్రత్తగా ఉండాలి.

    మేష రాశి:
    కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. ఆహ్లదకరమైన ప్రదేశాలకు వెళ్తారు. వివాహితులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    వృషభ రాశి:
    మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఊహించిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులకు సీనియర్లతో విభేధాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి:
    ఆధ్యాత్మికం వైపు ఆసక్తి చూపుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగులు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. ఒక ముఖ్యమైన సమాచారం ఆందోళనను కలిగిస్తుంది.

    కర్కాటక రాశి:
    శారీరక సమస్యలు ఉండే అవకాశం. మధ్యాహ్నం అనుకోకుండా డబ్బు వస్తుంది. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    సింహారాశి:
    వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగుపొరుగువారితో గొడవలు ఉండే అవకాశం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.జీవిత భాగస్వామి కోసం కొత్త వస్తువుల కొనుగోలు చేస్తారు.

    కన్య రాశి:
    ఆకస్మికంగా ఖర్చులు ఉంటాయి. ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవాలి. కుటుంబ వాతారణం ఆందోళనకరంగా ఉంటుంది.

    తుల రాశి:
    అనారోగ్యానికి గురయ్యే అవకాశం. కాబట్టి నాణ్యమైన ఆహారం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇంటికి సంబంధించి పత్రాల విషయంలో అలసత్వం వద్దు. తల్లిదండ్రులతో విభేదాలు ఉంటాయి. కాబట్టి వారితో సంయమనంగా ఉండే ప్రయత్నం చేయాలి.

    వృశ్చిక రాశి:
    కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొన్ని రంగాల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని పనులు సంతృప్తిని ఇస్తాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఏ పని చేపట్టినా జాగ్రత్తతో వ్యవహారించాలి.

    ధనస్సు రాశి:
    వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు ఉండే అవకాశం. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలపై చర్చిస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

    మకర రాశి:
    వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవం పొందుతారు. రాజకీయ రంగంలో ఉండేవారికి అనుకూల ఫలితాలు. వ్యాపారులు కొత్త అవకాశాలు పొందుతారు.

    కుంభరాశి:
    కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. భవిష్యత్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. శుభకార్యాలయాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    మీనరాశి:
    ఉద్యోగులు కార్యాలయాల్లో గొడవలు పడే అవకాశం.ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.