https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఒకే పాయింట్ మీద నామినేషన్స్ లో యష్మీ, నిఖిల్ కి ఇచ్చిపారేసిన టేస్టీ తేజ..ఇది మామూలు అరాచకం కాదు!

టేస్టీ తేజ మాట్లాడుతూ ' నిజమే ఆరోజు నేను గుడ్డుని పాముకి ఏకాభిప్రాయం రాకముందే తినిపించి తప్పు చేశాను. కానీ నా తర్వాత యష్మీ కూడా అదే చేసింది. నేను చేసింది తప్పు అయితే, యష్మీ చేసింది కూడా అదే కదా' అని అంటాడు టేస్టీ తేజ.

Written By:
  • Vicky
  • , Updated On : November 12, 2024 / 08:13 AM IST

    Bigg Boss Telugu 8(216)

    Follow us on

    Bigg Boss Telugu 8: టేస్టీ తేజ ఈ సీజన్ లో అన్ని విధాలుగా తన వైపు నుండి ది బెస్ట్ అని అనిపించుకుంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నామినేషన్స్ పాయింట్స్ వేయడంలో కానీ, టాస్కులు ఆడడంలో కానీ, ఎంటర్టైన్మెంట్ పంచడం లో కానీ, ఇలా ప్రతీ అంశంలో టేస్టీ తేజ తన మార్కుని చూపిస్తున్నాడు. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో అవతల కంటెస్టెంట్స్ ఇతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే బుక్ అయిపోతారు. నిన్న నిఖిల్, యష్మీ లను ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనే విధంగా లాక్ చేసాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిఖిల్ తేజ ని నామినేట్ చేస్తూ ‘ఇతని వల్ల ఎవిక్షన్ ఫ్రీ పాస్ గేమ్ ఆగిపోయింది, తప్పు చేసాడు కాబట్టే అతన్ని నామినేట్ చేస్తున్నాను బిగ్ బాస్’ అని చెప్తాడు. బయటకి వచ్చిన తర్వాత నిఖిల్ తేజ తాను ఊహించని పాయింట్ ని తీస్తాడని కలలో కూడా అనుకోలేదు, కానీ సరైన పద్దతిలో వాదించుకొని ఉండుంటే తేజ ని లాక్ చేసేవాడు. కానీ నిఖిల్ కి తన గురించి తాను వాదించుకోవడంలో చాలా బలహీనమైన స్కిల్స్ ఉన్నాయని నిన్నటి ఎపిసోడ్ తో అర్థమైంది.

    టేస్టీ తేజ మాట్లాడుతూ ‘ నిజమే ఆరోజు నేను గుడ్డుని పాముకి ఏకాభిప్రాయం రాకముందే తినిపించి తప్పు చేశాను. కానీ నా తర్వాత యష్మీ కూడా అదే చేసింది. నేను చేసింది తప్పు అయితే, యష్మీ చేసింది కూడా అదే కదా’ అని అంటాడు టేస్టీ తేజ. ఇక్కడ నిఖిల్ సేఫ్ గేమ్ ఆడి తన వికెట్ ని తానే పడగొట్టుకున్నాడు అని చెప్పొచ్చు. టేస్టీ తేజ అడిగిన ప్రశ్న కి నిఖిల్ సమాధానం చెప్తూ ‘అది నాకు తెలియదు.. నేను గమనించలేదు, నువ్వు యష్మీ తేల్చుకోండి. ప్రక్రియ రూల్స్ ని అనుసరించాలి అని చెప్పి అవతల వ్యక్తిని నామినేట్ చేసే నువ్వు, అదే ప్రక్రియ ని అనుసరించకపోతే ఎలా?, అందుకే నామినేట్ చేశాను ‘ అని అంటాడు. దీనికి నిఖిల్ ఇవ్వాల్సిన సమాధానం ఇది కాదు. ఎలా సమాధానం ఇవ్వాలంటే ‘యష్మీ చేసింది కూడా తప్పే. కానీ మొదలు పెట్టింది నువ్వే కదా, అందుకే నామినేట్ చేశాను. కేవలం ఒక్క ఓటు మాత్రమే వేయాలి కాబట్టి ఆ ప్రక్రియ ఆగిపోవడానికి నువ్వే మొదటి కారణం కాబట్టి నిన్నే నామినేట్ చేశాను’ అని చెప్పి ఉంటే సరిగ్గా ఉండేది. టేస్టీ తేజ ఇక ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చునేవాడు.

    కానీ యష్మీ తప్పు చేసిందని చెప్తే ఆమె వద్ద ఎక్కడ నెగటివ్ అవుతానో అనే భయంతో, అనవసరంగా ఆమెతో గొడవలు ఎందుకు అనే ఉద్దేశ్యంతో నిఖిల్ చాలా సేఫ్ గా ఆడాడు. ఇక్కడే ఆయన మొత్తం దొరికిపోయాడు, తేజ వేసిన ట్రాప్ లో పడిపోయాడు. మరోవైపు తేజ యష్మీ ని ఇదే పాయింట్ మీద నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె దానిని క్రమపద్ధతి లో వాదించుకోలేక, నీకు మొన్న హౌస్ లో మెజారిటీ వరస్ట్ కంటెస్టెంట్ అని ట్యాగ్ ఇచ్చారు, నేను ఇవ్వనందుకు బాధపడుతున్నా, దాని వల్ల మీ ఫ్యామిలీ హౌస్ లోకి రావడం లేదు, అది దురదృష్టకరమే, కానీ ఈరోజు చెప్తున్నా హౌస్ లో ది వరస్ట్ కంటెస్టెంట్ అంటే నువ్వే అని అంటుంది యష్మీ.