https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారు..

ప్రియమైన వారితో విభేదాలు ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 4, 2024 / 08:21 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కన్య రాశిలో సంచరించనున్నాడు. ఈరోజు గురు చంద్ర నవ పంచమి యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ప్రియమైన వారితో విభేదాలు ఉంటాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.

    వృషభ రాశి:
    ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంారు. కుటంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే అందులో విజయం సాధిస్తారు.

    మిథున రాశి:
    ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొందుతారు.భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త ప్లాన్ వేస్తారు. వ్యాపారులు ఈరోజు అదనపు లాభాలు పొందుతారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

    కర్కాటక రాశి:
    ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలపై దృష్టి పెట్టాలి. ఇంటి అవసరాల కోసం అప్పు చేయాల్సి వస్తుంది. బ్యాంకు రుణం ఇచ్చేందుకు అనువైన సమయం ఇదే. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.

    సింహారాశి:
    కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. బంధువులకు బహుమతులు తీసుకెళ్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు గురువుల సలహాతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

    కన్య రాశి:
    ఉద్యోగులు కొన్ని బాధ్యతలు నెరవేరుస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రకు వెళ్తారు. వ్యాపారులు కొన్ని విషయాల్లో అసంతృప్తిని పొందుతారు. కొత్త పెట్టుబడుల విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి.

    తుల రాశి:
    కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే అదనపు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. పిల్లల భవిష్యత్ కోసం కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    ఆర్థిక లావాదేవీలు జరిపేవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను ఏర్పరుచుకుంటారు. వివాహ కార్యక్రమంలో పాల్గొనడానికి సమాయత్తమవుతారు. పాత సమస్యలు నేటితో తొలగిపోతాయి.

    ధనస్సు రాశి:
    ఇంటి అవసరాల కోసం డబ్బు ఖర్చు చేరస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వ్యాపారులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.

    మకర రాశి:
    వైవాహిక జీవితం సంతృప్తిగా ఉంటుంది.కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. ఏదైనా భూమి కొనాలనుకుంటే ఇతరులను సంప్రదించాలి. ఉద్యోగులు మెరుగైన జీవితాన్ని పొందుతారు.

    కుంభరాశి:
    విద్యార్థులు శుభఫలితాలు పొందుతారు. కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారులకు స్వల్ప లాభాలు వచ్చే అవకాశం.

    మీనరాశి:
    కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనుల వల్ల నిరాశను ఎదుర్కొంటారు.