Rashmi Gautam: బుల్లితెర పై తిరుగు లేకుండా దూసుకుపోతుంది రష్మీ గౌతమ్. ఈ ఒరిస్సా భామకు తెలుగు అంతగా రాదు. అయితే గ్లామరస్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకుల్లో ఫేమ్ రాబట్టింది. జబర్దస్త్ షో ఆమెకు భారీ పాపులారిటీ తెచ్చిపెట్టింది. దశాబ్ద కాలంగా రష్మీ గౌతమ్ జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఆమె కంటే ముందు వచ్చిన అనసూయ ఓ రెండేళ్ల క్రితం జబర్దస్త్ కి గుడ్ బై చెప్పింది. సౌమ్యరావు, సిరి హన్మంత్ జబర్దస్త్ యాంకర్స్ గా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. వారిని తొలగించి రెండు వారాల జబర్దస్త్ ఎపిసోడ్స్ కి రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తుంది.
ఇక జబర్దస్త్ యాంకర్ అయ్యాక హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై కనిపించాలన్న కల కూడా నెరవేరింది. కెరీర్ బిగినింగ్ లో రష్మీ సపోర్టింగ్ రోల్స్ చేసింది. చిన్నాచితకా చిత్రాల్లో హీరోయిన్ గా నటించినా ఆ చిత్రాలు జనాల్లోకి వెళ్ళలేదు. ఒక దశలో రష్మీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. రష్మీ ప్రధాన పాత్రలో పలు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే చెప్పుకోదగ్గ హిట్స్ పడలేదు. దాంతో ఆఫర్స్ తగ్గాయి.
రష్మీ గౌతమ్ కి ఫేమ్ తెచ్చి పెట్టిన అంశాల్లో సుడిగాలి సుధీర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఒకటి. ఢీ, జబర్దస్త్ షోలు వేదికగా వీరిద్దరూ అద్భుతమైన కెమిస్ట్రీ కురిపించారు. ఏళ్ల తరబడి వీరు జంటగా బుల్లితెర ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు. ఒకటికి రెండుసార్లు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వీరికి పెళ్లి కూడా చేసింది. రష్మీ-సుడిగాలి సుధీర్ మధ్య ఉన్న బంధం ఏమిటనే సందేహం చాలా మందిలో ఉంది.
అయితే మేము ఆన్ స్క్రీన్ లవర్స్ మాత్రమే ఆఫ్ స్క్రీన్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పలు సందర్భాల్లో వెల్లడించారు. కాగా రష్మీ గౌతమ్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ చర్చకు దారి తీసింది. ఓ గ్లామరస్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రష్మీ గౌతమ్… కొత్త జ్ఞాపకాలకు… కొత్త ఆరంభం, అనే కామెంట్స్ జోడించింది. దీంతో రష్మీ పెళ్లి గురించి పరోక్షంగా హింట్ ఇచ్చిందని నెటిజెన్స్ భావిస్తున్నారు.
పెళ్లి చేసుకోబోతున్నారా? అబ్బాయి ఎవరు? అని కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి కాకుంటే రష్మీ ప్రేమలో పడి ఉండొచ్చని మరికొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా రష్మీ గౌతమ్ పోస్ట్ వెనుక ఆంతర్యం తెలియాలంటే.. కొన్నాళ్ళు వేచి చూడాలి. లేదంటే ఆమె నోరు విప్పాలి. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.