https://oktelugu.com/

Health Tips: మీ వయసు 40 దాటిందా? కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

0 ఏళ్లు దాటాక మీ డైట్లో తప్పక ఉండాల్సిన మరో ఆహార పదార్థం.. పప్పులు. మినప, శనగ పప్పు , పెసరపప్పు, లో అనేక పోషకాలు దాగి ఉంటాయి.. రోజూ వీటితో కూడిన వంటకాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 4, 2024 / 03:29 AM IST

    Health Tips

    Follow us on

    Health Tips: వయసు పెరుగుతుంటే శరీరం బలహీనంగా మారుతుంది. అంతేకాదు వివిధ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఒక వయసు తర్వాత తీసుకునే ఆహారం మీద శరీరానికి అందుతున్న పోషకాల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. కాబట్టి 40 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలు కొన్ని రకాల ఆహార పదార్థాలు(Foods) మీ డైట్ లో చేర్చుకోవాలి. కొన్నింటిని స్కిప్ చేయాలి. అయితే మీ డైట్ లో నేర్చుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

    ఆకుకూరలు : ఇవి హెల్తీ గా ఉండడానికి ఎప్పుడైనా మంచి ఎంపిక. 40 ఏళ్ల తర్వాత అయితే ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటి నుంచి ఐరన్, క్యాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు, వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి హిమోగ్లోబిన్, RBC, WBC కౌంట్‌ని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి. వీటిని కూరలు, చట్నీల రూపంలో తీసుకోవచ్చంటున్నారు నిపుణులు.

    పప్పులు : 40 ఏళ్లు దాటాక మీ డైట్లో తప్పక ఉండాల్సిన మరో ఆహార పదార్థం.. పప్పులు. మినప, శనగ పప్పు , పెసరపప్పు, లో అనేక పోషకాలు దాగి ఉంటాయి.. రోజూ వీటితో కూడిన వంటకాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. ఫలితంగా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు నిపుణులు.

    గుడ్లు : మీరు 40 సంవత్సరాల తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే మీ డైట్ లో కచ్చితంగా ఉడికించిన గుడ్డును ఉండేలా చూసుకోండి. దీనిలో విటమిన్ డి, బయోటిన్, ప్రొటీన్ కంటెంట్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి ఉడికించిన గుడ్లు తినాలి. దీని వల్ల కండరాలు శక్తిని కోల్పోకుండా బాడీ బలంగా తయారవుతుందని సలహా ఇస్తున్నారు నిపుణులు.

    యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలు : 40 సంవత్సరాల తర్వాత కూడా ఆరోగ్యంగా, చురుగ్గా ఉండే శరీరం కావాలంటే తప్పనిసరిగా యాంటీఆక్సిడెంట్ల ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు కలిగిన ఆహారం తప్పనిసరిగా మీ డైట్ లో చేర్చుకోవాలి. డార్క్ చాక్లెట్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ముఖ్యంగా ఇవి క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడంలో కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవాలంటున్నారు.

    2000లో ‘ఎక్స్‌ప్లోరేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజ్'(EPIC) పేరుతో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. 40 ఏళ్ల తర్వాత యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఆహారాలు తినే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని తేలింది. 40 సంవత్సరాల తర్వాత యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని యూకేలోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ టిమ్ అన్నారు.

    పాల ఉత్పత్తులు : జీర్ణక్రియ మెరుగ్గా ఉంటేనే ఆరోగ్యంగా ఉండవచ్చు. పెరుగు, మజ్జిగ వంటి పాల సంబంధిత ఆహార పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు వీటిలో కాల్షియం కూడా కావాల్సిందే. ప్రో-బయోటిక్స్ కూడా కావాల్సిందే. ఇవి పాలల్లో ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు అవసరమైన సంఖ్యలో బ్యాక్టీరియాను అందించి జీర్ణక్రియ తేలిక చేస్తాయి. ఇలా ప్రతిఒక్కరూ 40 ఏళ్ల తర్వాత కూడా ఈ డైట్ మెయింటెన్ చేయడం వల్ల చాలా అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.