Ustaad Bhagat Singh Trailer: ‘ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం మరో నాలు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరల్డ్ వైడ్ గా కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు కానీ, పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ బుకింగ్స్ లేవు. ఇకపోతే నిన్న ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి, మాస్ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని రోజులు సినిమా పై ఎలాంటి అంచనాలు లేవు కానీ, ట్రైలర్ ని చూసిన తర్వాత , ఎందుకో ఈ చిత్రం మినిమం గ్యారంటీ మూవీ లాగా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేశారు. ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలను పర్ఫెక్ట్ గా తీసినా కూడా ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
అయితే కొంత మంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే, కేవలం ఈ చిత్రం పై హైప్ పెంచడం కోసమే, సినిమాలోని హైలైట్ సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ ని ఉపయోగించి, ట్రైలర్ ని కట్ చేశారని, స్టోరీ ని ఎక్కడా రివీల్ కాకుండా చూసారని అంటున్నారు. స్టోరీ రివీల్ చేస్తే , ఎక్కడ ఈ చిత్రం తేరి కి రీమేక్ అని పసిగట్టేస్తారో అనే భయం తోనే ఇలా చేశారని సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ దురాభిమానులు చేస్తున్న కామెంట్స్. కానీ ఏది ఏమైనా డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో, అవన్నీ బాగా చూపించినట్టు తెలుస్తోంది.
రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ ని ఇంత ఎనర్జీ తో ఎవ్వరూ చూపించలేరు. పవన్ కళ్యాణ్ లో ఉన్న గొప్ప క్వాలిటీ కామెడీ టైమింగ్. ఈమధ్య కాలం లో ఇది అభిమానులు, ప్రేక్షకులు బాగా మిస్ అవుతూ వస్తున్నారు. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లో కామెడీ టైమింగ్ ని మాత్రం హరీష్ శంకర్ బాగానే వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇది వర్కౌట్ అయితే సగం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యినట్టే. కానీ కమర్షియల్ సినిమా కాబట్టి , పైగా ‘ధురంధర్ 2 ‘ లాంటి సినిమా పోటీ లో ఉంది కాబట్టి, యూత్ ఆడియన్స్ ఇది చాలా రొటీన్ సినిమా, ఎప్పుడో 2010 కాలం లో రావాల్సిన సినిమా, ఇలాంటి సినిమాలను పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ చేయడం ఏంటి ?, అది కూడా ఓజీ లాంటి చిత్రం చేసిన తర్వాత అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

