Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శివయోగం, సిద్ధయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు కొన్ని ఆనందాలను పొందుతారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు.
వృషభ రాశి:
ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలి.
మిథున రాశి:
ప్రియమైన వారితో సంతోషంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా గుర్తింపు వస్తుంది.
కర్కాటక రాశి:
పూర్వీకుల ఆస్తిపై కొన్ని శుభవార్తలు వింటారు. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.
సింహారాశి:
కొన్ని పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పకూడదు. బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునేవారికి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కన్య రాశి:
ఉన్నత విద్యనభ్యసించేవారు శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల రాశి:
పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ కోసం విద్యార్థులు కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త పెట్టబుడుడులు పెడుతారు.
వృశ్చిక రాశి:
విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. మధ్యాహ్నం కొత్త వ్యక్తులను కలుస్తారు.
ధనస్సు రాశి:
జీవితభాగస్వామితో విభేదాలు ఉంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు ఉంటాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబుడలు పెడుతారు.
మకర రాశి:
తోబుట్టువులను కలుసుకుంటారు. ఇంటికి చుట్టాల రాకతో సందడిగా ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
కుంభరాశి:
ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కుటుం బ సభ్యుల మద్దతు పొందాలి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.
మీనరాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. కొత్త పెట్టుబుడులు పెడుతారు. అనుకోని ఆదాయం వస్తుంది. సాయంత్రం జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు.