Rishabh Pant : బీసీసీఐ రూపొందించిన రి టెన్షన్ పాలసీ ప్రకారం ఒక ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. అయితే వచ్చే సీజన్లో కూడా ఆర్టీఎం కార్డు నిబంధనను బీసీసీఐ పక్కన పెట్టిందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావడానికి మరికొద్ది గంటల సమయం పట్టే అవకాశం ఉంది.. నిబంధనలు తెలుసుకోవడంతో.. అన్ని జట్లకు సంబంధించి ఆటగాళ్ల బదిలీలు, రి టెన్షన్ గురించి రకరకాల వార్తల వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిరాధార సమాచారం ఎక్కువగా చక్కర్లు కొడుతోంది. అయితే ఇలాంటి తప్పుడు వార్తలు రిషబ్ పంత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. తనపై వస్తున్న పుకార్లపై అతడు గట్టిగా స్పందించాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే
” ఆయన తన వ్యవహారాలను పరిశీలించే మేనేజర్ ద్వారా ఇటీవల బెంగళూరు జట్టు యాజమాన్యాన్ని సంప్రదించాడు. బెంగళూరు జట్టులో సారధ్య స్థానం ఖాళీగా ఉండడంవల్ల.. దానికోసం పంత్ ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. కానీ బెంగళూరు జట్టు అతడిని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. మరోవైపు విరాట్ కోహ్లీ బెంగళూరులోకి రిషబ్ పంత్ రావడాన్ని ఒప్పుకోలేదు. రిషబ్ పంత్ ఎదుగుదలను చూసి కోహ్లీ తట్టుకోలేకపోతున్నాడు. టీమిండియా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో రిషబ్ పంత్ రాజకీయాలు చేస్తున్నాడు. అందువల్లే బెంగళూరు జట్టు నాయకత్వ బాధ్యతను రిషబ్ పంత్ కు ఇవ్వకుండా కోహ్లీ అడ్డుకున్నాడని” ట్విట్టర్ యూజర్ సంచలన ట్వీట్ చేశాడు . దీనిపై రిషబ్ పంత్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఆ ట్వీట్ కు అదిరిపోయేలాగా సమాధానం ఇచ్చాడు..” ఇది తప్పుడు వార్త. సామాజిక మాధ్యమ వేదికను ఇప్పుడు వార్తల కేంద్రాలుగా ఎందుకు మార్చుతున్నారు. కాస్త సమయం మనం పాటించండి. హుందాతనాన్ని కలిగి ఉండండి. ఇలాంటి వ్యవహారం సరికాదు. నిజం తెలుసుకోకుండా ఇలాంటి నిరాధార వార్తలను ప్రచారం చేయకండి. ముఖ్యంగా ఆటగాళ్లలో అభద్రతా భావాన్ని సృష్టించకండి. ఇలాంటి ప్రచారాలు నాపై జరగడం తొలిసారి కాదు. అలాగని ఇప్పటితో ఆగిపోతాయని అనుకోవడం లేదు. సంబంధిత వర్గాల నుంచి సమాచారాన్ని మరోసారి పరిశీలించండి. అది నిజం అని తేలితేనే ట్వీట్ చేయండి.. ఇలాంటి ట్విట్లు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. ఇలాంటి వ్యవహార శైలి రోజురోజుకు పెరిగిపోతుంది. మీరు మాత్రమే కాదు, మీలాంటి వాళ్లు ఇలా తప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తున్నారు. ఇది అందరికీ చెబుతున్నానని” రిషబ్ గట్టిగా రిప్లై ఇచ్చాడు.. అయితే దీనిపై ఆ ట్వీట్ చేసిన వ్యక్తి రిప్లై ఇచ్చాడు.. “మీరు త్వరలో పంజాబ్ జట్టుకు వెళ్తున్నారని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఓ పేరుపొందిన జర్నలిస్టు వ్యాఖ్యానించాడు. దానిపై కూడా మీరు స్పందించాలని” అతడు రిప్లై ఇచ్చాడు.