Horoscope Today : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 ఫిబ్రవరి 4న కొన్ని రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మరి కొన్ని రాశుల వారు ఎక్కువగా వాదనలకు దిగకపోవడం మంచిది. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
ఈరోజు ఈ రాశి వారు ఏకాగ్రతతో పని చేస్తారు బంధువులు స్నేహితులతో ఎక్కువగా వాదనలు చేయొద్దు. ఆదాయం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
వృషభ రాశి:
వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేముందు ఇతరులను సంప్రదించాలి. కొన్ని పనుల్లో ఓపిక ఉండాలి. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండాలి. వారితో ఎక్కువగా వాదనలకు దిగకపోవడం మంచిది. ఆదాయం పెరుగుతుంది. చేసే పని పైన దృష్టిని ఉంచాలి.
మిథునం:
ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే అనుకున్న పనులు నెరవేరుతాయి. ఇతరులతో వాదనలు చేయడం వల్ల నష్టం ఏర్పడుతుంది. కొన్ని పనుల కోసం ప్రయత్నాలు కొనసాగించాలి.
కర్కాటకం:
శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో తోటి వారి మద్దతు ఉంటుంది. అయితే లక్ష్యాన్ని నిర్దేశించిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు నైపుణ్యంతో ప్రవర్తించాలి.
సింహ:
ఉద్యోగులు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారుల పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఇతరులను సంప్రదించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.
కన్య:
కొన్ని విషయాల్లో బిడియం నష్టాన్ని తెస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పనిని సొంతంగా చేసుకోవడమే మేలు ఇతరులతో సంప్రదించేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయకపోవడం మంచిది.
తుల:
వ్యాపారస్తులకు ఆకస్మిక లాభాలు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ప్రియమైన వారితో ఆహ్లాదంగా గడుపుతారు.
వృశ్చికం:
ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభం. వ్యాపారులకు మంచి సమయం. కొత్తగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక అదృష్టం వస్తుంది. అవసరాలకు తగిన ఆదాయం సమకూరుతుంది.
ధనస్సు:
ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు మనోబలంతో పూర్తి చేయాలి. శుభకార్యాలలో ఇతరులతో వాదనలకు దిగకూడదు. బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం చేయొద్దు. కొన్నిసార్లు ఒత్తిడికి గురైనా ఆందోళన చెందకుండా నైపుణ్యంతో ప్రవర్తించాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.
మకర:
శత్రువులు మీపై ఆధిపత్యానికి ప్రయత్నిస్తారు. కొన్ని విషయాల్లో ఓపిక చాలా అవసరం. ఆరోగ్యం సమస్యలు వేధిస్తాయి. కానీ ఒత్తిడికి గురి కావొద్దు. మనోధైర్యంతో ముందుకు సాగాలి.
కుంభం:
గతంలో మొదలు పెట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు మంచి సమయం వ్యాపారాలకు లాభాలు వస్తాయి. కొన్ని విషయాల్లో స్పష్టత వచ్చి సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా గడుపుతారు.
మీనం:
వ్యాపారులకు అనుకూలం. ఇప్పుడు పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో లాభాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.