https://oktelugu.com/

Daaku Maharaaj Review : ‘డాకు మహారాజ్ ‘ ప్రీమియర్ షో రివ్యూ…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే బాలయ్య బాబు మరోసారి తన నటి విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా బాలయ్యను 'మ్యాన్ ఆఫ్ ది మాసేస్' అని ఎందుకంటారో ఈ సినిమా చూస్తే మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 12, 2025 / 07:48 AM IST

    Daaku Maharaaj review

    Follow us on

    Daaku Maharaaj Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఇప్పటికి వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న ఆయన హ్యాట్రిక్ విజయాలనునమోదు చేసుకోవడమే కాకుండా యావత్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉంటే బాబీ డైరెక్షన్ లో బాలయ్య చేసిన ‘డాకు మహారాజు’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోస్ వేశారు. కాబట్టి ఈ సినిమా ఎలా ఉంది బాలయ్య బాబు మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడా? లేదా అనే విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ లో ఉండే ‘డాకు మహారాజ్’ ఆ ప్రాంతం లో జరిగే అన్యాయాన్ని ఎదిరిస్తూ రౌడీలను చంపేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి వైష్ణవి అనే అమ్మాయి కోసం ఆంద్ర కి వస్తాడు… మరి ఆయన ఆంధ్ర కి ఎందుకు వచ్చాడు ఇంతకీ ఆ వైష్ణవి అనే అమ్మాయి ఎవరు? ఆమెను కాపాడడానికి ఆయన ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాడనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక విశ్లేషణ విషయానికి వస్తే డైరెక్టర్ బాబి ఈ సినిమా కథని రోటీన్ గా రాసుకున్నప్పటికి అందులో ట్రీట్మెంట్ మాత్రం చాలా కొత్తగా రాసుకున్నాడు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ ఒక్క అంశం కూడా మాకు బోర్ కొట్టకుండా ముందుకు సాగుతుంది. ప్రతి సీన్ లో తన టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ని రాసుకుని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నమైతే చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన చాలావరకు సక్సెస్ అయితే సాధించాడనే చెప్పాలి. ఇక బాలయ్య బాబు ఇంట్రాడక్షన్ సీన్ కి పూనకాలు వస్తున్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది… ఇందులో వచ్చే కోర్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయం లో చాలా బాగా హెల్ప్ అయ్యాడు. ఇక ఏది ఏమైనా కూడా బాబీ ఇంతకు ముందు చేసిన ‘వాల్తేరు వీరయ్య ‘ సినిమా తర్వాత చేసిన ఈ సినిమాలో తన పూర్తి ఎఫర్ట్స్ అయితే కనిపించాయి.

    మరి ఏది ఏమైనా బాలయ్య బాబుకు ఈ సినిమాతో మరొక సక్సెస్ పడిందనే చెప్పాలి…ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాధ్ ల పాత్రలు కూడా మెప్పిస్తాయి. అలాగే వాళ్ళ పాత్రలకు చాలా వరకు ప్రాధాన్యమైతే ఉంటుంది. బాబీ డియోల్ పాత్ర కూడా చాలా బాగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా అతని ఇంట్రాడక్షన్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే బాలయ్య బాబు మరోసారి తన నటి విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా బాలయ్యను ‘మ్యాన్ ఆఫ్ ది మాసేస్’ అని ఎందుకంటారో ఈ సినిమా చూస్తే మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇంతకుముందు వచ్చిన సినిమాల్లో చూపించిన ఎమోషన్స్ ను బీట్ చేస్తూ ఈ సినిమాలో బాబీ బాలయ్య బాబు లో ఉన్న పూర్తి రౌద్రరూపాన్ని చూపించడమే కాకుండా ఎమోషన్ ని పండించడంలో కూడా పీక్ స్టేజ్ లోకి తీసుకెళ్లాడనే చెప్పాలి…మొదటి నుంచి నుంచి చివరి వరకు బాలయ్య వన్ మ్యాన్ షో చేస్తూ ముందుకు సాగడనే చెప్పాలి.

    మరి ఈ సినిమా లో బాలయ్య బాబు నటన బాగుంది ఇంతకుముందు సినిమాల్లో ఆయన ఒక పరిమితి వరకే యాక్టింగ్ అయితే చేయగలిగాడు. కానీ ఈ సినిమాలో ఎక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి లేకుండా పాత్రలో లీనమైపోయాడనే చెప్పాలి… హీరోయిన్స్ గా చేసిన ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ పాత్రలు చాలా లిమిటెడ్ గా ఉన్నప్పటికి అందులో కూడా వాళ్ళు చాలా బాగా నటించి మెప్పించారు. అనిమల్ తర్వాత బాబీ డియోల్ మంచి విలనిజాన్ని పండించాడు. ఇక మిగిలిన ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ గానీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గానీ చాలా ఎక్స్ట్రాడినరీ గా ఇచ్చారు. బాలయ్య బాబు సినిమా అనగానే తమన్ కి పూనకాలు వచ్చినట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే కొడతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ లో తమన్ కూడా చాలా వరకు కీలక పాత్ర వహించాడనే చెప్పాలి…

    ఫోటోగ్రఫీ కూడా చాలావరకు సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహించింది. ప్రతి షాట్ ని కూడా చాలా ఫ్రెష్ గా తీయాలనుకున్న సినిమాటోగ్రాఫర్ కష్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది… ఇక సితార వాళ్ళు అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమాకి చాలా బాగా సెట్ అయిందనే చెప్పాలి…

    ప్లస్ పాయింట్స్

    బాలయ్య
    డైరెక్షన్
    యాక్షన్ ఎపిసోడ్స్

    మైనస్ పాయింట్స్

    రోటీన్ స్టోరీ
    కొన్ని అనవసరమైన సీన్స్

    రేటింగ్

    ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5