https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశులపై వైకుంఠ ఏకాదశి ప్రభావం.. వీరికి విష్ణువు అనుగ్రహం..

పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వ్యాపారం మొదలు పెడుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : January 10, 2025 / 08:00 AM IST

    Horoscope Today(3)

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త వ్యాపారం మొదలు పెడుతారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులు సీనియర్ల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. వ్యాపారులు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కొన్ని విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను కలుస్తారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి ధన సాయం అందుతుంది.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు ప్లానింగ్ వేస్తారు. ప్రియమైన వారితో ఉత్సాహంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకోకుండా సంపద పెరుగుతుంది. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే వెంటనే వసూలు చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఇంట్లో ఎవరితోనైనా వాగ్వాదం ఉంటే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామితో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఓ పని కోసం డబ్బు సాయం చేస్తారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయాల్లో ఉద్యోగులు ఎవరి మాటలను వినొద్దు. కొన్ని విషయాల్లో తొందరపడకుండా ఉండాలి.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులు కీలక పనులను పూర్తి చేసుకోవాలి. బంధువుల్లో ఒకరి నుంచి శుభవార్త అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపలో ఉంచుకోవాలి.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందువల్ల ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు.