https://oktelugu.com/

Mokshajna : మోక్షజ్ఞ సినిమా ఈ సంవత్సరం కూడా డౌటేనా..? ప్రశాంత్ వర్మ బాలయ్య మధ్య జరుగుతున్న గొడవ ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే... ఇక సినిమా ఇండస్ట్రీ నందమూరి ఫ్యామిలీకి ఎనలేని గుర్తింపైతే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : January 10, 2025 / 08:03 AM IST

    Mokshajna

    Follow us on

    Mokshajna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే… ఇక సినిమా ఇండస్ట్రీ నందమూరి ఫ్యామిలీకి ఎనలేని గుర్తింపైతే ఉంది. ఇక వాళ్ల నుంచి వస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసి పెడుతున్నాయి… మరి ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇండస్ట్రీ లో ఉన్న వాళ్ళు టాప్ పొజిషన్ ను కోసాగిస్తు ముందుకు సాగుతున్నారు…

    నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు నందమూరి తారకరామారావు తర్వాత నందమూరి ఫ్యామిలీ బాధ్యతలు మోస్తూ వస్తున్నాడు. మరి ఇప్పటివరకు తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్న బాలయ్య బాబు తన తర్వాత తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి భారీ విజయాన్ని అందుకున్నప్పటికి బాలయ్య బాబుకి ఎన్టీఆర్ కి మధ్య ఇప్పుడు అంత మంచి సన్నిహిత సంబంధాలైతే లేనట్టుగా తెలుస్తున్నాయి. కాబట్టి మోక్షజ్ఞని హీరోగా ఇంట్రడ్యూస్ చేసి ఎలాగైనా సరే అతన్ని స్టార్ హీరోగా మార్చాలనే ఉద్దేశంతో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తనను అనుకున్నట్టుగానే ఈ సంవత్సరం మోక్షజ్ఞ ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి ఆ గుర్తింపును కాపాడుకుంటూ ముందుకు రావాలంటే మాత్రం ఈ జనరేషన్ లో ఉన్న హీరోలు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి.

    అందుకే బాలయ్య బాబు తన కొడుకు మోక్షజ్ఞ తో ఎలాగైనా సరే మొదటి సినిమాతో సక్సెస్ కొట్టించాలనే ఉద్దేశ్యంతోనే ఇన్ని సంవత్సరాల నుంచి అతను వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి మోక్షజ్ఞ సిద్ధమవుతున్నాడు.

    మరి ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమా ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక ఆయన వైఖరి బాలకృష్ణ కి నచ్చకపోవడంతో మోక్షజ్ఞ మొదటి సినిమాని వేరే దర్శకుడికి అప్పజెప్పే పనిలో బాలయ్య బాబు ఉన్నాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా మొదటి సినిమా విషయంలో కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు.

    మరి ఈ సినిమాని ప్రశాంత్ వర్మ డైరెక్టు చేస్తాడా లేదంటే వేరే దర్శకులతో డైరెక్ట్ చేసే అవకాశం ఉందా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… బాలయ్య బాబుకి ప్రశాంత్ వర్మకి మధ్య ఎక్కడ వివాదం జరిగిందనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు. కానీ బాలయ్య మాత్రం ప్రశాంత్ వర్మ విషయంలో అంత సంతృప్తిగా లేడనే వార్తలైతే వస్తున్నాయి…చూడాలి మరి ఈ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అనేది…