Akira Nandan : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ సూపర్ సక్సెస్ ఫుల్ హీరోలుగా రాణిస్తూ ముందుకు సాగుతూ ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు వీళ్ళు సాధించిన విజయాలన్నీ వాళ్లకి మంచి ఇమేజ్ ను తీసుకువచ్చి పెట్టాయి…ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. కాబట్టి ఆయన నట వారసున్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అకిరా నందన్ సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ ని తీసుకుంటూ చాలా బిజీగా ఉన్నాడు. మరి అకిరా నందన్ ఇండస్ట్రీకి వస్తున్న క్రమంలో అతని పేరులో కూడా చిన్న చిన్న మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలందరి పేర్లు మార్చుకోవడం విశేషం…శివశంకర వరప్రసాద్ గా ఉన్న పేరును చిరంజీవిగా మార్చుకున్నాడు.ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఎదిగాడు. ఇక నాగబాబు సైతం నాగేంద్రబాబుగా ఉన్న పేరును నాగబాబుగా మార్చాడు. ఇక కళ్యాణ్ గా ఉన్న పేరును పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నాడు.
రామ్ చరణ్ తేజ్ అయితే స్క్రీన్ నేమ్ గా రామ్ చరణ్ పెట్టుకున్నారు. ఇక రీసెంట్ గా సాయిధరమ్ తేజ్ కూడా తన పేరుని సాయి దుర్గ తేజ్ గా మార్చుకోవడం విశేషం… ఇక ఇదే క్రమంలో ఇప్పుడు ఇండస్ట్రీకి రాబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో అయిన అకిరా నందన్ కూడా తన పేరును మార్చుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి అకిరా నందన్ అనే పేరు మొత్తాన్ని మారుస్తారా లేదంటే వెనక ముందల ఏమైనా ఆడ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ ని ఎలాడానికి మరొక మెగా హీరో ముందుకు వస్తూ ఉండడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ లాంటి నటుడు పాన్ ఇండియా నటుడి గా గుర్తింపు తెచ్చుకుని ముందుకు సాగుతున్న క్రమంలో అకిరా నందన్ కూడా ఆయన స్థాయిలో రాణించి మంచి విజయాలను అందుకోవాలని యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకులను అలరించాలని అందరూ కోరుకుంటున్నారనే చెప్పాలి.
ఇతను మొదటి సినిమాగా పవన్ కళ్యాణ్ నటించిన కొన్ని సినిమాలను రీమేక్ చేస్తాడు అంటు కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి అందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…