https://oktelugu.com/

Horoscope Today: ఈ రెండు రాశుల వారికి ఆకస్మికంగా ధన లాభం.. అన్నింటా విజయమే..

ఆదాయం రావడం ఆలస్యమవుతుంది. దీంతో కొంత నిరాశను ఎదుర్కొంటారు. వ్యాపారులు శుభవార్తలు వింటారు. ఆస్తికి సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 27, 2024 / 08:10 AM IST

    Horoscope Today(1)

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మంగళవారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈరోజు చంద్రుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. ఈరోజు రవియోగం కారణంగా మఇథునం, మకర రాశుల వారికి అనుకోని ఆదాయం వస్తుంది. మిగతా రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రోజు ఈ రాశి వారికి అన్నీ అనుకూల ఫలితాలే ఉంటాయి. పిల్లల భవిష్యత్ గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగులకు తోటివారి మద్దతు ఉంటుంది. కుుటంబ సభ్యులతో కలిసిమెలిసి ఉంటారు. ఏ పని చేసినా ఆలోచనాత్మకంగా ఉండాలి.

    వృషభ రాశి:
    ఆదాయం రావడం ఆలస్యమవుతుంది. దీంతో కొంత నిరాశను ఎదుర్కొంటారు. వ్యాపారులు శుభవార్తలు వింటారు. ఆస్తికి సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

    మిథున రాశి:
    విద్యార్థులు కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

    కర్కాటక రాశి:
    కొత్త పనిని ప్రారంభించేముందు ఇతరుల సలహాలు తీసుకోవాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితుల సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పిల్లల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

    సింహారాశి:
    వ్యాపారులు కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరులను సంప్రదించాలి. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

    కన్య రాశి:
    ఆర్థికంగా పుంజుకుంటారు. కొన్ని ఆలోచనలు ఇబ్బందిని పెడుతాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. వ్యాపారం కోసం చేసే పెట్టుబడులు భవిష్యత్ లో లాభిస్తాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

    తుల రాశి:
    గతంలో చేసిన కొన్ని పనులకు ఇప్పుడు గౌరవంపొందుతారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు. బంధువుల నుంచి ప్రయోజనాలు ఉంటాయి.

    వృశ్చిక రాశి:
    మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులు ఏ పని మొదలుపెట్టినా విజయమే వరిస్తుంది. ఏదైనా విషయాన్ని ఓపికతో వినాలి. వాదనలకు దూరంగా ఉండాలి.

    ధనస్సు రాశి:
    తండ్రితో వాగ్వాదానికి దిగుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. జీవిత భాగస్వామి కోసం ప్రత్యేకంగా బహుతిని కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

    మకర రాశి:
    వ్యాపారులు శుభవార్తలు వింటారు. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. పిల్లల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    కుంభరాశి:
    ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు పెండింగులో ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగొంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

    మీనరాశి:
    ఉద్యోగులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. తల్లిదండ్రులతో కలిసి మెలిసి ఉంటారు. అనుకోని ఆదాయం వస్తుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.