Hardhik Pandya : హార్దిక్ భాయ్.. నీ మనసు నొప్పించాం.. మమ్మల్ని క్షమించు

Hardhik Pandya ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో చివరి ఓవర్ ను హార్థిక్ పాండ్యా వేశాడు. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి.. కీలకమైన మిల్లర్, మరో బ్యాటర్ వికెట్ లను పడగొట్టాడు.

Written By: NARESH, Updated On : July 3, 2024 9:54 pm

Rohit Sharma fans apologize to Hardik Pandya

Follow us on

Hardhik Pandya : 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. వెస్టిండీస్ లోని బార్బడోస్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 176 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 76 పరుగులు చేసి.. టీమిండియా ఇన్నింగ్స్ భారాన్ని మొత్తం మోసాడు. 34 పరుగులకే మూడు వికెట్ల కోల్పోయినప్పటికీ.. అక్షర్ పటేల్, శివం దూబే తో కలిసి కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.

176 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్లాసెన్ మెరుపు అర్ధ సెంచరీ తో ఆకట్టుకున్నప్పటికీ.. కీలకమైన దశలో ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా ఓటమి బాట పట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో చివరి ఓవర్ ను హార్థిక్ పాండ్యా వేశాడు. కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి.. కీలకమైన మిల్లర్, మరో బ్యాటర్ వికెట్ లను పడగొట్టాడు. దీంతో గెలుపు వాకిట దక్షిణాఫ్రికా బోల్తా పడింది. ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ హార్థిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ వేయడంతో టీమ్ ఇండియా గెలిచింది.

14 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా టి20 వరల్డ్ కప్ గెలవడం.. అందులో హార్దిక్ పాండ్యా పాత్ర ఉండటంతో.. సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యాను రోహిత్ అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. హార్దిక్ ను రోహిత్ అభిమానులు క్షమించమని కోరుతున్నారు. టీవీలలో హార్దిక్ పాండ్యా కు బొట్టుపెట్టి.. మమ్మల్ని క్షమించన్నా అని అడుగుతున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో విస్తృతమైన వ్యాప్తిలో ఉన్నాయి.. ఇటీవలి ఐపిఎల్ లో ముంబై జట్టు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. గతంలో ముంబై జట్టును రోహిత్ నడిపించాడు. రోహిత్ ఆధ్వర్యంలో ముంబై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఉన్నట్టుండి హార్దిక్ కు కెప్టెన్సీ ఇవ్వడంతో రోహిత్ అభిమానుల్లో ఆగ్రహం పెరిగింది. దీంతో వారు హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీనికి తోడు ఐపిఎల్ లో ముంబై జట్టు దారుణమైన ప్రదర్శన చేసింది. అయితే ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా సాధించిన విజయంలో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించడంతో.. గతంలో తాము చేసిన తప్పులను మన్నించాలని రోహిత్ అభిమానులు హార్దిక్ ను కోరుతున్నారు.