https://oktelugu.com/

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర సినిమా చేయడానికి కారణం ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. నిజానికి కష్టపడి సినిమాలు చేసే ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరో లు కానీ, దర్శకులు కానీ వాళ్ల పూర్తి ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డారనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : August 22, 2024 / 08:25 AM IST

    Chiranjeevi

    Follow us on

    Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో చిరంజీవి…సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి ఈయనకి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నన్ని రోజులు ఆయన పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఆయన చేసిన సినిమాలు, పేద ప్రజలకు ఆయన అందించిన సహాయం ఎవరు మర్చిపోలేరు. మెగాస్టార్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనం అనే చెప్పాలి. అప్పటి వరకు మూస ధోరణి లో సాగిన ప్రతి సినిమాకు కాలం చెల్లింది అంటూ డాన్సులతో ఫైట్లతో ప్రేక్షకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఏకైక హీరో చిరంజీవి… అందుకే ఆయన దాదాపు 40 సంవత్సరాలపాటు ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పటికి కూడా ఆయన ఎనర్జీని మ్యాచ్ చేసే హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లేకపోవడం విశేషం…ఇక బి.గోపాల్ దర్శకత్వంలో 2002 వ సంవత్సరంలో చిరంజీవి ఇంద్ర సినిమాని చేశాడు.

    అయితే ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా చిరంజీవి ఒక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాని కూడా చేయగలడు అని ఆయన్ని సరికొత్తగా ప్రజెంట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా రావడానికి ముందు ఫ్యాక్షన్ బ్యాడ్రాప్ లో సినిమాలు చేయాలంటే అది బాలయ్య బాబుకి మాత్రమే సాధ్యమవుతుందని చాలామంది అనుకునేవారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించి ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్టుగా నిలపడమే కాకుండా మొదటిసారి 37 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఏకైక తెలుగు సినిమాగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో చాలామంది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తెరకెక్కించారు. అయినప్పటికీ ఆ సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఈరోజు చిరంజీవి బర్త్ డే సందర్బంగా ఈ సినిమాని 4 కే లో రీ రిలీజ్ చేసి ప్రేక్షకుల యొక్క మెప్పు పొందడానికి సినిమా యూనిట్ అయితే చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాని స్క్రీన్ మీద చూడడానికి చాలామంది అభిమానులు ఉత్సాహాన్ని చూపించడమే కాకుండా భారీ రేంజ్ లో ఈ సినిమాకి బుకింగ్స్ కూడా జరిగాయనే తెలుస్తుంది.

    ఇక ముఖ్యంగా ఈ సినిమాతో ఇంద్ర సినిమా రీ రిలీజ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ లో భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి సూపర్ హిట్ సినిమా అయిన ఇంద్ర కూడా రీ రిలీజ్ లో భారీ వసూళ్లను రాబట్టాలని అభిమానులైతే కోరుకుంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా రీ రిలీజ్ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది…