https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు శత్రువుల బెడద ఎక్కువ.. జాగ్రత్తగా ఉండాలి..

సమాజంలో గౌరవం పెరుగుతుంది. అకస్మాత్తుగా ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ ఆశయాలు నెరవేర్చడంలో సక్సెస్ అవుతారు. జీవిత భాగస్వామి నుంచి వ్యాపారులు సలహా తీసుకోవాలి. అధిక మొత్తంలో డబ్బును పొందుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 1, 2024 / 07:38 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆదివారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది.ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఈరోజు శివయోగం కారణంగా కొన్ని రాశుల వారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. మరికొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. షాపింగ్ కోసం బిజీ వాతావరణాన్ని గడుపుతారు.

    వృషభ రాశి:
    కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. రాజకీయ రంగాలకు చెందిన వారు కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు.

    మిథున రాశి:
    విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవత భాగస్వామితోకలిసి ఆనందంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతోసరదాగా ఉంటారు. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. పిల్లల కెరీర్ కు సంబంధించి శుభవార్తలు వింటారు.

    కర్కాటక రాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. అకస్మాత్తుగా ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ ఆశయాలు నెరవేర్చడంలో సక్సెస్ అవుతారు. జీవిత భాగస్వామి నుంచి వ్యాపారులు సలహా తీసుకోవాలి. అధిక మొత్తంలో డబ్బును పొందుతారు.

    సింహారాశి:
    సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

    కన్య రాశి:
    పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఏదైనా వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. వ్యాపరస్తులకు భాగస్వామి మద్దతు ఉంటుంది.

    తుల రాశి:
    పాత రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. వైద్య సలహా తీసుకోవాలి. అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉంటారు. పాత స్నేహితులను కలుస్తారు. రాజకీయ రంగంలోని వారు గౌరవం పొందుతారు.

    వృశ్చిక రాశి:
    స్టాక్ మార్కెట్లో డబ్బు పెడితే మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తికి సంబంధించిన వివాదాలు ఉంటే నేటి పరిష్కారం అవుతాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

    ధనస్సు రాశి:
    ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బును వృథా చేయకుండా చూసుకోవాలి.

    మకర రాశి:
    స్నేహితుల్లో ఒకరికి సాయం చేస్తారు. విద్యారంగంలో ఉన్న వారు కొత్త ప్రయత్నాలు చేస్తారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. జీవనోపాధికి సంబంధించి శుభవార్తలు వింటారు.

    కుంభరాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యలుతో సరదాగా గడుపుతారు.

    మీనరాశి:
    బంధువుల నుంచి ధన సాయం పొందుతారు. జీవితంలో అడ్డంకులు ఉంటే అవి నేటితో తొలగిపోతాయి. పిల్లల కెరీర్ పై ఆందోళన ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.