https://oktelugu.com/

Health Tips: అధిక వ్యాయామం చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..

శరీరంపై అధిక ఒత్తిడి పనితీరును తగ్గిస్తుంది. ఆహారం లేకపోవడం కూడా ఇదే విధంగా ప్రభావాన్ని చూపుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అధిక వ్యాయామం వల్ల అమ్మాయిల్లో హార్మోన్ ఉత్పత్తి రేటు తగ్గుతుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : September 1, 2024 / 07:30 AM IST

    Exercising excessively

    Follow us on

    Health Tips: ప్రస్తుత జీవన శైలిలో చాలామంది వేగంగా బరువు తగ్గాలని తెగ వ్యాయామం అలవాటు చేసుకున్నారు. బాడీ షేప్ కూడా బాగుండాలని జిమ్ లకు వెళ్లి ఫుల్ వర్కౌట్లు చేస్తున్నారు. గంటల పాటు తెగ చెమట చిందిస్తూ కష్టపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకోవాలన్నా సరే క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీంతో కొందరు ఫిట్‌నెస్‌ ఫ్రీక్స్‌గా మారతారు. విపరీతంగా వ్యాయామం చేస్తుంటారు. కానీ అతి ఏ విషయంలోనూ మంచిది కాదు. అధిక వ్యాయామం హాని కలిగిస్తుంది. ఆ ప్రమాదం మహిళలకు మరింత ఎక్కువ. అతిగా వ్యాయామం చేయడం వల్ల రుతుచక్రంపై ప్రభావం చూపుతుంది. సక్రమంగా రుతుక్రమం రాదు. ఈ వ్యాధిని ‘అమెనోరియా’ అంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి లేదా ఆహారం సమయానికి అందాలి. లేదంటే ఈ ఈ సమస్య వస్తుంది.

    శరీరంపై అధిక ఒత్తిడి పనితీరును తగ్గిస్తుంది. ఆహారం లేకపోవడం కూడా ఇదే విధంగా ప్రభావాన్ని చూపుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. అధిక వ్యాయామం వల్ల అమ్మాయిల్లో హార్మోన్ ఉత్పత్తి రేటు తగ్గుతుంది. ఇది సాధారణంగా మహిళల ఋతు చక్రంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ప్రతి నెలా జరగాల్సిన రుతుక్రమం అస్తవ్యస్తంగా మారుతుంది. ప్రతి రెండు మూడు నెలలకోసారి పీరియడ్స్ కూడా రావచ్చు. అయితే అధిక వ్యాయామం, కఠినమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుందట.

    అనేక సందర్భాల్లో భారీ శారీరక శ్రమ సాధారణం కంటే తక్కువ ఋతు రక్తస్రావం కలిగిస్తుంది. బాడీలో కొవ్వు ఉంటే ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి రేటు ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఈ హార్మోన్ ఋతుస్రావంతో సంబంధం కలిగి ఉంటుంది. అయితే ఆకస్మిక బరువు తగ్గడం వల్ల ఋతు రక్తస్రావం తగ్గుతుంది.

    నెలనెలా రుతుక్రమం రాకపోవడం అస్సలు మంచిది కాదు. మహిళలకు పీరియడ్స్ సక్రమంగా లేకుంటే శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇది ఎముకలను ప్రభావితం చేస్తుంది. ఎముక నష్టం కూడా సంభవించవచ్చు. అయితే ఈ సమస్య వస్తే మాత్రం ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది అంటున్నారు నిపుణులు. ఆహారంలో మార్పుల నుంచి వ్యాయామ సమయాన్ని తగ్గించడం వరకు జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు తీసుకోవడం ద్వారా పరిష్కారాన్ని అందిస్తాయి.

    రుతుక్రమం సమయంలో తేలికపాటి వ్యాయామం, యోగా చేస్తే పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపు నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటున్నారు నిపుణులు. అయితే ఈ సమయంలో ఎక్కువ శారీరక వ్యాయామం చేయవద్దని సలహా ఇస్తున్నారు. అందుకే ఈ సమయంలో వ్యాయామం, శారీరక శ్రమ చేయకుండా శరీరాన్ని కూల్ గా ఉండనివ్వాలి అంటున్నారు నిపుణులు. అధికంగా వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఒంట్లో నీళ్ల శాతం తగ్గుతుంది. తద్వారా శరీరం డిహైడ్రేట్ అవుతుంది. ఎక్కువ సమయం పాటు శక్తికి మించి కష్టపడడం మంచిది కాదు. వేగంగా బరువు తగ్గాలని చేసే ఈ ప్రయత్నంలో కండరాల పైన తీవ్ర ఒత్తిడి పడుతుందనే విషయం చాలా మంది మర్చిపోతారు. కొన్నిసార్లు కండరాలు దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.