Horoscope Today: ఈ మూడు రాశుల వారికి శత్రువుల బెడద ఎక్కువ.. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి..

ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొంత నష్టాన్ని చూసే అవకాశం. కుటుంబ సభ్యుల మధ్య మనసపర్థలు ఉంటాయి. జీవితా భాగస్వామి కోసం ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు.

Written By: Chai Muchhata, Updated On : August 11, 2024 8:16 am

Horoscope Today

Follow us on

Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తుల రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్విపుష్కర యోగం ఏర్పడనుంది. దీంతో మిథునం, కన్య రాశుల వారికి విశేష ఫలితాలు కలగనున్నాయి. ఇదే సమయంలో తుల, మేుషం, కుంభ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
ఉద్యోగులు కార్యాలయంలో శత్రువులను ఎదుర్కొంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబ సభ్యులతో చిన్న గొడవలు ఉంటాయి. వీటి పరిష్కారానికి చొరవ చూపాలి. సాయంత్రం స్నేహితులతో సరదాగా ఉంటారు.

వృషభ రాశి:
కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. వీరికి తండ్రి మద్దతు ఉంటుంది. నాణ్యమైన ఆహారంపై దృష్టి పెట్టాలి.

మిథున రాశి:
ఉపాధి కోసం చూసేవారు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో మద్దతు ఉంటుంది. కోర్టు సమస్యలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి.

కర్కాటక రాశి:
కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. సామాజికి కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సింహారాశి:
ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారులు కొంత నష్టాన్ని చూసే అవకాశం. కుటుంబ సభ్యుల మధ్య మనసపర్థలు ఉంటాయి. జీవితా భాగస్వామి కోసం ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు.

కన్య రాశి:
ఉద్యోగులకు శత్రువుల బెడద ఉంటుంది. ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

తుల రాశి:
కొందరు మిమ్మల్ని మాటలతో కష్టపెడుతారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కష్టపడి పనిచేస్తారు. దీనికి ఫలితం ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి:
ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబ సభ్యులు ఉల్లాసంగా గడుపుతారు. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.

ధనస్సు రాశి:
తల్లిదండ్రులతో వాగ్వాదం ఉంటుంది. ఏ పని అయినా ఆలోచన్మాతకంగా చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సాయంత్రం జీవిత భాగస్వామితో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తవారికి ధన సాయం చేయకూడదు.

మకర రాశి:
వైవాహిక జీవితంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరు బిజీ షెడ్యూల్ గడుపుతారు. ఇతరులతో మెరుగైన సంబంధాలు ఏర్పరుచుకుంటారు. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి.

కుంభరాశి:
మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు పెట్టుబడి పెట్టాల్సి వస్తే కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ధన సాయం చేయడానికి ముందుకు వస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

మీనరాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో అదనపు పెట్టుబడులు పెడుతారు. తల్లిదండ్రులతో కలిసి తీర్థ యాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో ఆదాయ వనరులు వస్తాయి. ఏ పని చేపట్టినా సక్సెస్ అవుతుంది.