Paris Olympics 2024: పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల పోరాటం ముగిసింది. ఈసారి కి ఆరు మెడల్స్ తో భారత్ సరిపుచ్చుకుంది. వాస్తవానికి భారత జట్టు ప్లేయర్లకు రెండు అంకెల స్థాయిలో మెడల్స్ సాధించే సత్తా ఉన్నప్పటికీ.. ఒలింపిక్స్ లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ.. చాలామంది కొంత తేడాతో మెడల్ స్కూల్ పోయారు. దీంతో డబుల్ డిజిట్ మార్క్ మరోసారి కలగానే మిగిలింది. 2016 ఒలింపిక్స్ లో పీవీ సింధు రజతం, సాక్షి మాలిక్ కాంస్యం పతకాలు సాధించి భారత పరువును కాపాడారు. అయితే ఆ తర్వాతే ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణాన్ని సాధించాడు. ఆ ఒలింపిక్స్ లో భారత్ ఏకంగా ఏడు మెడల్స్ సాధించింది. ఒలింపిక్ చరిత్రలో భారత ప్లేయర్లు సాధించిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. అయితే ఇదే జోరులో ఈసారి మన ఆటగాళ్లు రెండు అంకెల స్థాయిలో మెడల్స్ సాధిస్తారని అందరూ భావించారు. అయితే గత ఒలింపిక్స్ ప్రదర్శన కూడా పునరాగం కాలేదు. పైగా ఒక మెడల్ తగ్గింది, దీనికి తోడు స్వర్ణం రాలేదు. ఆయా పోటీలలో మన ఆటగాళ్ల ప్రదర్శన బాగున్నప్పటికీ.. చివర్లో మెడల్స్ సంఖ్య తగ్గడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.
షూటింగ్ విభాగంలో..
షూటింగ్ భాగంలో ఈసారి భారత్ మూడు మెడల్స్ సాధించింది. ఈ విభాగంలో భారత్ ఎప్పుడూ కూడా ఈ స్థాయిలో మెడల్స్ సాధించలేదు. పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో రజతం గెలుస్తుందని అందరూ అనుకుంటే.. మను బాకర్ చివర్లో తరబడి కాంస్యం తో సరిపెట్టుకుంది.. 25 మీటర్ల ఫిజికల్ విభాగంలో ఆమె వెంట్రుక వాసిలో కాంస్యం మిస్ చేసుకుంది. మరో షూటర్ అర్జున్ బబుత నాలుగో స్థానానికి పడిపోయింది.
స్వర్ణాన్ని గెలవాల్సిన వారు..
జావెలిన్ త్రో లో నీరజ్ చోప్రా, రెజ్లింగ్ లో వినేశ్ ఫొగాట్ స్వర్ణాలు గెలవాల్సిన వారు.. నీరజ్ చోప్రా ఉత్తమ ప్రదర్శన చేసినప్పటికీ స్వర్ణం గెలుచుకోలేకపోయాడు. పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ అద్భుతమైన ప్రదర్శన చూపడంతో పసిడి సాధించాడు. రెజ్లింగ్ లో ఫైనల్ గెలిచేలా కనిపించిన వినేశ్.. చివరికి 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో మెడల్ లేకుండానే వెనుదిరిగింది. పైన పేర్కొన్న పోటీలలో ఆటగాళ్లు గనక మెడల్స్ సాధించి ఉంటే భారత్ డబుల్ డిజిట్ సాధించేది.
ఇక ఈ పోటీలలో భారత క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. గత ఒలింపిక్స్ తో పోలిస్తే ఔరా అనిపించారు. ప్రపంచ స్థాయి క్రీడాకారులతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. అయితే చాలామంది మెడల్ సాధించే క్రమంలో.. దాటాల్సిన చిన్న లైన్ వద్దే ఆగిపోయారు. అయితే ఆ గీత ఎలా అధిగమించాలనే దానిపై ఆటగాళ్లు కసరత్తు చేస్తే.. భారత జట్టుకు ఇబ్బంది ఉండదు. పారిస్ ఒలింపిక్స్ లో ఆటగాళ్లకు అదృష్టం కూడా తోడై ఉంటే కచ్చితంగా మెడల్స్ సాధించి ఉండేవారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. పారిస్ ఒలంపిక్స్ లో మన ప్లేయర్ల ఆటతీరు మెరుగైందని.. లాస్ ఏంజెల్స్ లో జరిగే వచ్చే ఒలంపిక్స్ లో కచ్చితంగా మెడల్స్ సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.