https://oktelugu.com/

Vastu Tips : వాస్తు టిప్స్: ఇంట్లో ఎప్పటికీ గొడవలు జరుగుతున్నాయా? అయితే ఈ పని చేయండి..

ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో గొడవలు వస్తుంటాయి. అయితే కొందరు ఇవన్నీ సొంత ఇంట్లో చేయాలా? లేకా అద్దె ఇంట్లో చేయాలా? అనే సందేహం ఉంటుంది. ఏ ఇంట్లో ఉన్నా ఇలాంటి వాస్తు టిప్స్ పాటిస్తేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : August 11, 2024 / 07:15 AM IST

    Fights

    Follow us on

    Vastu Tips : ఇల్లు సంతోషంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. కానీ కొందరి ఇళ్లల్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వస్తుంటాయి. అయితే కొందరి ఇంట్లో కొన్ని రోజుల పాటు గొడవలు జరిగి ఆ తరువాత సర్దు కుంటాయి. కానీ కొందరు ఇళ్లల్లో ప్రతీ రోజూ ఏదో ఒక విషయంలో వాదించుకుంటారు. ఇల్లు సంతోషంగా లేదంటే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉందని అర్థం. అంటే ఇంట్లో కొన్ని వస్తువులు సక్రమంగా లేవని తెలుసుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇంట్లో వాళ్ల మధ్య గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలంటే పూజలు, వ్రతాలు చేస్తారు. వీటితో పాటు ఇంట్లోని వస్తువులు సక్రమంగా ఉననప్పుడే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఒక ఇంట్లోని కుటుంబ సభ్యులు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముందుగా ఇంటి పరిశుభ్రత పాటించాలి. అలాగే మిగతా విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. అవేంటంటే?

    సాముద్రిక శాస్త్రం ప్రకారం ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటాం. అలాగే ఇంట్లోని వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఉంచినట్లయితే అనుకున్న పనులు నెరవేరుతాయి. వీటిలో రాక్ సాల్ట్ ఒకటి. రాళ్ల ఉప్పు గురించి ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం రాళ్ల ఉప్పు ఇంట్లో శుభాలను తెస్తుంది. కుటుంబంలో నెగెటివ్ ఎనర్జీని పారద్రోలడానికి రాక్ సాల్ట్ ఉపయోగపడుతుంది. ఇంట్లోని ప్రతి మూలన రాక్ సాల్ట్ ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ రాళ్ల ఉప్పును ప్రతీనెలకోసారి మారుస్తూ ఉండాలి.

    కొందరు తమ ఇళ్లల్లో పూర్వీకులు చిత్రాలు ఇష్టమొచ్చినట్లు గొడకు తగిలిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా నెగెటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. ఈ ఫొటోలను కచ్చితంగా నైరుతి దిశలో ఉంచాలి. అలా ఉంచినప్పుడే ఇల్లు సంతోషంగా ఉంటుంది. లేకుంటే గొడవలు జరుగుతాయి. అలాగే ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా వాటర్ ఫౌంటేన్ ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఎలాంటి చికాకులు లేని జీవితం సాగుతుంది. ప్రశాంతమైన ఇంటి కోసం బుద్ధుడి విగ్రహం ను కూడా ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది.

    పరిశుభ్రమైన ఇంటి వైపు లక్ష్మీదేవి చూడదని అంటారు. అందువల్ల ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో దుమ్ము, ధూళి ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇంట్లో దుమ్ము, ధూళి ఉండకుండా చూసుకోవాలి. అప్పుడే ఇల్లు సంతోషంగా ఉంటుంది. అలాగే ఇంటిని శుభ్ర పరిచే చీపురును ఇష్టం వచ్చినట్లే పడేయరాదు. ఈ చీపురును నైరుతి దిశలో మాత్రమే ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో గొడవలు వస్తుంటాయి. అయితే కొందరు ఇవన్నీ సొంత ఇంట్లో చేయాలా? లేకా అద్దె ఇంట్లో చేయాలా? అనే సందేహం ఉంటుంది. ఏ ఇంట్లో ఉన్నా ఇలాంటి వాస్తు టిప్స్ పాటిస్తేనే ఇల్లు సంతోషంగా ఉంటుంది.