Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై హస్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు లక్ష్మీనారాయణకు అనువైన రోజు. అందువల్ల కొన్ని రాశుల వారికి అధికమైన ధన ప్రయోజనాలు ఉండే అవకాశం. మరికొన్ని రాశుల వారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తారు. కొందరు శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి.
వృషభ రాశి:
ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. రాజకీయ నాయకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల సాయంతో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు.
మిథున రాశి:
ఆసక్మిక లాభాలు వచ్చే అవకాశం. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనాల కోసం దారులు పడుతాయి. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని చేసే పెట్టుబడులు లాభిస్తాయి.
కర్కాటక రాశి:
గృహానికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యువకులు వ్యాపారంలో రావడానికి ఉత్సాహం చూపుతారు.
సింహారాశి:
సమాజంలో కొన్ని అవమానాలు పొందుతారు. ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రకటన విషయంలో స్పందించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ప్రతిభను ప్రదర్శించడానికి అనుకూల సమయం.
కన్య రాశి:
డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఏర్పడుతాయి. ఎంత కష్టమొచ్చినా కొన్ని పనులు పూర్తి చేయడానికి వెనుకాడొద్దు. కుటుంబ సభ్యల మధ్య మనస్పర్థలు ఏర్పడుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి:
ఈ రాశి వారు కొంత నిరాశతో ఉంటారు. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అదనంగా ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్నిసమస్యలు వచ్చే అవకాశం. ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు.
వృశ్చిక రాశి:
ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్ లో రెట్టింపు అవుతాయి.అయితే ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి. జీవిత భాగస్వామితో సంతోసంగా ఉంటారు. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం. వ్యాపారుల కొన్ని లాభాలు పొందుతారు.
ధనస్సు రాశి:
వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థికంగా పుంజుకుంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కొందరు కొత్తవ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మకర రాశి:
పెండింగ్ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తారు. వ్యాపారులు పెట్టుబడుల కోసం ఇతరుల నుంచి ఆదాయం పొందుతారు. కుటుంబంలో కొన్ని గొడవలు ప్రారంభం అవుతాయి. ఏ పని పూర్తి చేయడానికైనా ఆలోచించాలి.
కుంభరాశి:
ఉద్యోగులు సీనియర్ల మద్దతు పొంాదాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తుల నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం. మానసికంగా కొంత గందరగోళంగా ఉంటుంది.
మీనరాశి:
ఈ రాశి ఉద్యోగులు ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ప్రణాళికను చేపడుతారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.