Sleeping : ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత అవసరమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటి నిండా నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. చిన్న పిల్లలకి అయిన కన పెద్దవాళ్లకైనా సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్ర లేస్తున్నారు. పగలు ఎంత పడుకున్న.. రాత్రి నిద్ర చాలా ముఖ్యమైనది. ఒక్కరోజు నిద్ర లేకపోతే దాన్ని కవర్ చేసుకోవడానికి దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల నిద్ర అవసరం అవుతుంది. నిద్ర లేకపోతే రోజంతా కాస్త చిరాకుగా ఉంటుంది. ఏ పని మీద కూడా శ్రద్ధ పెట్టలేరు. బాడీకి సరైనా నిద్ర అందకపోతే.. గుండెపోటు, టైప్ 2 డయాబెటిస్, ఉబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిద్ర తక్కువ అయితే కొంతమందికి మానసిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శరీరానికి సరిపడ నిద్ర అనేది తప్పనిసరి. అయితే ఈ నిద్ర అనేది వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఏ వయసు వారు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలో అన్ని గంటలు పడుకుంటేనే.. ఆరోగ్యంగా ఉంటారు. వయసును బట్టి నిద్రపోవాలని యూఎస్ లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. మరి అవేంటో చూద్దాం.
నవజాత శిశువులు (0-3 నెలలు)
అప్పుడే పుట్టిన నవజాతి శిశువులకు రోజుకి 14 నుంచి 17 గంటలు నిద్ర అనేది తప్పనిసరి. ఎందుకు అంటే వీళ్లు తల్లి గర్భం నుంచి బయటకు రావడం వల్ల బాడీలో మార్పులు అనేవి ఉంటాయి. కాబట్టి ఎక్కువ సేపు నిద్ర అనేది వీళ్లకు తప్పకుండా ఉండాలి.
శిశువులు (4-11 నెలలు)
ఈ సమయంలో పిల్లలు మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వీళ్లకి 12 నుంచి 15 గంటల నిద్ర తప్పనిసరి.
పసిపిల్లలు (1 నుంచి 2 సంవత్సరాలు)
ఈ వయస్సులో ఉండే పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి రోజుకి 11 నుంచి 14 గంటలు నిద్ర అనేది అవసరం.
3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు
ఈ వయస్సులో పిల్లలు స్కూల్ కి వెళ్లడం మొదలు పెడతారు. వీళ్లు ఆరోగ్యంగా ఉండటానికి 10 నుంచి 13 గంటల నిద్ర అవసరం.
6 నుంచి 12 సంవత్సరాలు
పిల్లలు ఎక్కువగా ఈ వయసులో స్కూల్ కి వెళ్లి ఆడుతుంటారు. వాళ్లు రోజంతా స్కూల్లో యాక్టివ్ గా ఉండడానికి 9 నుంచి 12 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.
13 నుంచి 18 సంవత్సరాలు
ఈ వయసులో పిల్లలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్లకి తెలియకుండానే చదువు లేదా వ్యక్తిగతంగా విషయాల్లో టెన్షన్ పడతారు. కాబట్టి వీళ్లు రోజుకి కనీసం 8 నుంచి పది గంటలు నిద్రపోవాలి
18 నుంచి 60 సంవత్సరాలు
కుటుంబ బాధ్యతలు, ఉద్యోగం, చదువు, వ్యక్తిగత కారణాలు వంటి వాటి వల్ల చాలామంది తక్కువగా నిద్రపోతారు. ఈ వయసు వాళ్లు తప్పకుండా 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.
60 సంవత్సరాలు పైబడినవారు
ఈ వయసులో ఉన్నవాళ్లు చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. ఎలాంటి సమస్యలు ఉన్నా రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యంగా ఉంటారు.