https://oktelugu.com/

Samantha: హీరోయిన్ సమంత కి తీవ్ర గాయాలు..మోకాళ్ళ చుట్టూ సూదులు..అభిమానులకు వణుకు పుట్టిస్తున్న లేటెస్ట్ ఫోటోలు!

హిట్ అయితే బయ్యర్స్ కి లాభాల వర్షమే. అందుకే ఇప్పుడు సమంత రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కంటే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. రీసెంట్ గా ఆమె 'సిటాడెల్' అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 5, 2024 / 08:20 AM IST

    Samantha

    Follow us on

    Samantha: పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకున్న అతి కొద్దిమందిలో ఒకరు సమంత. ఇండస్ట్రీ లోకి ఈమె ‘ఏ మాయ చేసావే’ అనే చిత్రంతో అడుగుపెట్టింది. ఈ సినిమాతోనే ఆమె ఆడియన్స్ ని మాయ చేసి స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టింది. వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్ హీరోలందరి సినిమాల్లో అవకాశాలు సంపాదించి హిట్టు మీద హిట్టు కొడుతూ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మారింది. ఇప్పుడు కేవలం సమంత కోసం థియేటర్స్ కి వచ్చి చూసే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఆ రేంజ్ లో ఆమె తన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకుంది. సమంత ఇప్పుడు ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం చేస్తే 20 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అవలీల గా జరుగుతుంది.

    హిట్ అయితే బయ్యర్స్ కి లాభాల వర్షమే. అందుకే ఇప్పుడు సమంత రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కంటే ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తుంది. రీసెంట్ గా ఆమె ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానుంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ లో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి యాక్షన్ సినిమానే ఆమె బాలీవుడ్ మరొకటి చేస్తుంది. అందుకు సంబంధించిన కొన్ని షాట్స్ చేయగా సమంత మోకాళ్ళకు బాగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సూదులు గుచ్చిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ ‘దెబ్బలు తగలకుండా నేను యాక్షన్ స్టార్ ని అవ్వలేనా’ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇది బాగా వైరల్ అవ్వడంతో అభిమానులు కంగారు పడ్డారు.

    అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, మయోసిటిస్ వ్యాధి నుండి రీసెంట్ గానే కోలుకున్నావ్, ఇలాంటి సమయంలో మళ్ళీ శరీరమంతా గాయాలు చేసుకొని ఇబ్బందికి గురి కాకు, నీకు ఏమైనా జరిగితే మేము తట్టుకోలేము అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా సమంత చివరి సారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘ఖుషి’. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా యావరేజ్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమె సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. ఈమధ్యనే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఆమె కొత్త టాలెంట్ ని ప్రోత్సహించడమే కాకుండా, ఆమెనే హీరోయిన్ గా నటిస్తూ పలు సినిమాలు కూడా చేస్తుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకుంది, అలాగే తమిళ హీరో విజయ్ కూడా ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం.