https://oktelugu.com/

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారులకు భారీ లాభాలు.. ఉద్యోగులకూ పదోన్నతి..

వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పొందుతారు. స్నేహితులతో కలిసి శుభాకార్యాల్లో పాల్గొంటారు. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 6, 2025 / 08:08 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today:జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. దీంతో సోమేశ్వర అనుగ్రహంలో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి.మరికొన్ని రాశుల వారు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో.. ఈ కిందికి వెళ్లి చూడండి..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) :వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పొందుతారు. స్నేహితులతో కలిసి శుభాకార్యాల్లో పాల్గొంటారు. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : విహారయాత్రలకు ప్లాన్ చేస్తారు. ఎవరితోనైనా ఆర్థిక లావాదేవిలు జరపాలనుకునేవారికి ఇదే మంచి సమయం. కుటుంబంలో జరిగే కొన్ని శుభకార్యక్రమాల గురించి చర్చిస్తారు.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొన్నట్లయితే విజయం సాధిస్తారు. ఉద్యోగులు అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. లక్ష్యం పూర్తి చేసిన వారికి మాత్రం పదోన్నతి పొందే అవకాశం.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. రాత్రి ఉల్లాసంగా గడుపుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే కలిసి వస్తుంది.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఇతరులకు ధన సాయం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం ఇంటికి అతిథి వచ్చే అవకాశం. ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రశంసలు దక్కుతాయి. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఎవరితో వాగ్వాదం చేయకూడదు. లేకపోతే తీవ్ర నష్టాలు జరుగుతాయి. తొందరపాటునిర్ణయాలు తీసుకొవద్దు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. కొందరు కొత్త వ్యక్తులు వీరికి సమస్యగా మారొచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొత్త పనిని ప్రారంభించేముందు ఇతరుల సలహా తీసుకోవాలి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులకు బ్యాంకు నుంచి రుణ సాయం అందుతుంది. అనుకోకుండా ప్రయాణాలు చేయొచ్చు. వాహనాలపై వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో విభేదాలు ఏర్పడితే వెంటనే పరిష్కరించుకోవాలి.

    ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : శత్రువుల బెడద ఎక్కుగగా ఉండే అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొత్త అవకాశాలనుపొందుతారు. కష్టానికి అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వ్యాపారులుమంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులు కొత్త విషయాలపై ఆసక్తి చూపుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొన్ని విషయాల్లో తొందరపడకూడదు.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆరోగ్యంపై జాగ్రత్తవహించాలి. సోదరుడి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఆహారపు అలవాట్లను నియంత్రించాలి. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : సొంత తెలివితేటలు ఉపయోగించి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొత్త పనులు ప్రారంభిస్తారు.