https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ కి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు..ఏదైనా జరిగితే నీదే బాధ్యత అంటూ వార్నింగ్!

పోలీసులు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని రాకుండా చేసేందుకు చాలా గట్టి వాదనలే కోర్టులో వినిపించారు కానీ, చివరికి కోర్టు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది. రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ప్రతీ ఆదివారం సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక్కడితో ఈ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది అని అనుకుంటే నిన్న రాంగోపాల్ పేట పోలీసులు మళ్ళీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన మ్యానేజర్ మూర్తి కి SI నోటీసులు జారీ చేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 6, 2025 / 08:18 AM IST
    Follow us on

    Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలను మొత్తం మనం గత నెల రోజులుగా చూస్తూనే ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అల్లు అర్జున్ తో పాటు తెలుగు సినీ పరిశ్రమపై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడడం, ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ మరుసటి రోజు పోలీసులు అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా ఒక పది నిమిషాల వీడియో ని విడుదల చేయడం వంటివి జరిగాయి. పోలీసులు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని రాకుండా చేసేందుకు చాలా గట్టి వాదనలే కోర్టులో వినిపించారు కానీ, చివరికి కోర్టు అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది. రెండు నెలల పాటు పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ ప్రతీ ఆదివారం సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది.

    ఇక్కడితో ఈ మ్యాటర్ క్లోజ్ అయిపోయింది అని అనుకుంటే నిన్న రాంగోపాల్ పేట పోలీసులు మళ్ళీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన మ్యానేజర్ మూర్తి కి SI నోటీసులు జారీ చేసాడు. ఆ నోటీసులో ‘కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ ని పరామర్శించేందుకు రావొద్దు. ఆ తర్వాత అక్కడ ఏమైనా అశాంతి వాతావరణం నెలకొని ఏదైనా జరగరానివి జరిగితే మీరే బాద్యులు. కోర్టు లో కేసు ఉన్నంత కాలం మీరు అతన్ని కలవడానికి వీలు లేదు’ అంటూ నోటీసులు జారీ చేసారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఇప్పటికే అల్లు అర్జున్ మరియు పుష్ప మూవీ టీం కలిసి శ్రీతేజ్ కి రెండు కోట్ల రూపాయిల ఆర్ధిక సాయం అందించారు. అందులో అల్లు అర్జున్ కోటి రూపాయిలు ఇవ్వగా, డైరెక్టర్ సుకుమార్ మరియు నిర్మాతలు చెరో 50 లక్షల రూపాయిలు అందించారు.

    మరోవైపు అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం చేయడం కోసం సిద్ధం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో త్వరలో ఆయన 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేయబోతున్నాడు. పీరియాడిక్ నేపథ్యం సాగే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు. నిన్న మొన్నటి వరకు ఆయనకు పొడవాటి జుట్టు ఉండేది, ఇప్పుడు ఆ జుట్టుని కత్తిరించి చాలా షార్ట్ గా చేసుకున్నాడు. డీజే మూవీ సమయం లో ఆయన లుక్ ఎలా ఉండేదో, మళ్ళీ అలాంటి లుక్ లోకి వచ్చేసాడు. అభిమానులు ఆ లుక్ ని చూసి ఎంతో సంతోషిస్తున్నారు. ఫిబ్రవరి నెల నుండి ఈ త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా వేగవంతం అవుతుందని, ఈ చిత్రం అల్లు అర్జున్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ అవుతుందని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.