Maharaja
Maharaja : ఓటీటీ వచ్చిన దగ్గర నుంచి సినిమాల వసూళ్ల రేట్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. దీని కంటే ముఖ్యంగా థియేటర్ లలో జనం తగ్గారు. చాలా తక్కువ రోజుల్లోనే ఓటీటీలో సినిమాలు విడుదల అవడంతో చాలా మంది థియేటర్ కు వెళ్లకుండా కొన్ని రోజులు వెయిట్ చేసి ఇంట్లోనే సినిమా చూడాలి అనుకుంటున్నారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నాయి. అభిమాన హీరో, హీరోయిన్ సినిమాలు వస్తే థియేటర్ ను బద్దలు చేస్తుంటారు అభిమానులు. అయితే మన దేశంలోనే కాదు మన దేశ హీరో సినిమాకు చైనాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంతకీ స్టోరీ ఏంటంటే?
విజయ్ సేతుపతి తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘మహారాజా’ భారతదేశంలో ప్రజల ప్రశంసలను అందుకుంది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల కింగ్ గా కూడా నిలిచింది. ఇక గతేడాది నవంబర్‌లో ఈ సినిమా చైనా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం చైనాలో 10వ అతిపెద్ద భారతీయ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సినిమా చూసిన చైనా ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు. ఏకధాటిగా ఏడుస్తూ కనిపించారు కూడా.
సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో చైనా ప్రేక్షకుల కళ్లు చెమర్చాయనే చెప్పాలి. థియేటర్‌లో తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఈ చిత్రాన్ని చూసి చైనీస్ ప్రేక్షకులు భావోద్వేగానికి లోనవుతున్నారు. వైరల్ క్లిప్‌ను గబ్బర్ సింగ్ అనే ఖాతాలో ఎక్స్‌లో పంచుకున్నారు. మొత్తం మీద ఏదో ఒకవిధంగా తండ్రీ-కూతురు సెంటిమెంట్ తో వచ్చే ఇండియన్ చిత్రాలు చైనాలో బాగానే ఆడుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. దంగల్, సింగింగ్ సూపర్ స్టార్ వంటి సినిమాలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటే ఇప్పుడు మహారాజా కూడా అంతకు మించి రెస్పాన్స్ ను అందుకుంది.
గత ఐదేళ్లలో చైనాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ చిత్రంగా విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ నిలిచింది. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యు జింగ్ తన X హ్యాండిల్‌ను ఉపయోగించి చైనాలో ‘మహారాజా’ బాక్సాఫీస్ విజయం అప్డేట్ ను పంచుకున్నారు. చిత్రం పోస్టర్‌ను పోస్ట్ చేస్తూ, “మహారాజా 2018 నుంచి చైనాలో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా అవతరించిందని.. రూ. 91.55 కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు.
Maharaja has become the highest-grossing Indian film in China since 2018, reaching Rs 91.55 crore. Well done pic.twitter.com/sq9SUY8D5F
— Yu Jing (@ChinaSpox_India) January 5, 2025
ఈ సినిమాలు చైనాలో కూడా బాగా ఆడాయి.
విజయ్ సేతుపతి ‘మహారాజా’తో పాటు అమీర్ ఖాన్ ‘దంగల్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’, ఆయుష్మాన్ ఖురానా ‘అంధాధున్’, రాణి ముఖర్జీ ‘హిచ్కీ’ వంటి ఇతర భారతీయ చిత్రాలు కూడా చైనాలో మంచి విజయాన్ని సాధించాయి. ఇక మహారాజా సినిమాకు నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నట్టి సుబ్రమణ్యం, అభిరామి గోపీకుమార్, దివ్య భారతి, సింగంపులి, అరుల్దాస్, మునిష్కాంత్, సచ్చా నామిదాస్, మణికందన్ వంటి ప్రముఖ సెలబ్రెటీలు ఉన్నారు.
Somehow Father-daughter Indian movies do really well in China. Dangal, Singing Superstar and now Maharaja. pic.twitter.com/CeSlNPDknk
— Gabbar (@GabbbarSingh) January 4, 2025