Horoscope Today: 2024 జూన్ 26 బుధవారం రోజున ద్వాదశ రాశులపై ధనిష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు లక్ష్మీనారాయణ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల వాతావరణం ఉండనుంది.
మేష రాశి:
కొత్త ఆలోచనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. వ్యాపారాలు చేసే ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది. ప్రత్యర్థుల బెడద ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి
వృషభ రాశి:
ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. ప్రియమైన వ వారితో సంతోషంగా ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మిథున రాశి:
ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఇంటికి అతిధులు వస్తారు స్నేహితుల మద్దతు ఉంటుంది. రావాల్సిన బకాయిలు వస్తాయి.
కర్కాటక రాశి:
పిల్లలనుంచి శుభవార్తలు వింటారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజుతో పూర్తవుతాయి. ఆస్తుల విషయంలో శుభవార్త వింటారు.
సింహారాశి:
ఈరోజు స్నేహితులు అనుకూలంగా ఉంటారు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో మార్పులు చేస్తారు. సన్నిహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఆశించిన లాభాలు వస్తాయి.
కన్య రాశి:
ఉద్యోగులు, వ్యాపారులు వాదన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. కొన్ని వైపుల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
తుల రాశి:
అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. అన్ని రకాల శుభాలు జరుగుతాయి. గ్రహాల అనుకూలతతో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల సహాయం ఉంటుంది.
వృశ్చిక రాశి:
సమాజంలో గౌరవం ఉంటుంది. పెండింగ్ పనుల్ని పూర్తి చేస్తారు. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. నిపుణుల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు.
ధనస్సు రాశి:
గ్రహాల కలయిక కారణంగా ఈ రాశి వారికి శుభ్రంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మిత్రుల సహాయం అందుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు.
మకర రాశి:
కొన్ని పనుల నిమిత్తం బిజీగా ఉంటారు. వ్యాపారం పై ఎక్కువగా దృష్టి పెట్టాలి లేకుంటే నష్టపోతారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల సలహాలు తీసుకోవాలి.
కుంభరాశి:
స్నేహితుల సహకారం ఉంటుంది. కుటుంబ సబ్యులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు అనుకొని ఆదాయం ఉంటుంది. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.
మీనరాశి:
కొన్ని కీలక నిర్ణయాలు సహాయం ఇస్తాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.