Horoscope Today : 2024 జనవరి 29న ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఓ రాశి వారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. మరో రాశివారికి అవమానాలు ఎదురవుతాయి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
వాతావరణంలో మార్పులతో ఆరోగ్యంగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దీనిని పోగొట్టుకోవడానికి పరిష్కారం ఆలోచించాలి. ఇతరుల నుంచి ఏమీ ఆశించొద్దు.
వృషభం:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులు ఇతరులతో సత్సంబంధాలు పెరుగుతాయి. పోటీ పరీక్షలు రాసే వారికి అనుకూల సమయం.
మిథునం:
రోజువారీ ఖర్చులు పెరుగుతుంది. ఆదాయం బాగున్నందున ఇబ్బంది ఉండదు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఓ సమాచారం సంతోషాన్ని ఇస్తుంది.
కర్కాటకం:
మానసికంగా ఇబ్బందిగా ఉంటారు. ఇతరులతో మనస్పర్థలు వస్తాయి. అవసరానికి తగిన ఆదాయం వస్తుంది. సోమరితనాన్ని వదిలేయాలి. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహ:
కొన్ని అవమానాలు ఎదుర్కొంటారు. ఇంట్లో వారితో ఎక్కువగా వాదనలకు దిగొద్దు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని శ్రద్ధగా చేయండి. వ్యాపారులకు లాభాల వస్తాయి.
కన్య:
ఆధ్యాతికపై ఆసక్తి తగ్గుతుంది. ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం తగ్గిపోతుంది. అన్నింటిలోనూ విజయం సాధిస్తారు.
తుల:
ఉద్యోగులకు కార్యాలయాల్లో ప్రతికూల వాతావరణం. అభిరుచుల కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నిర్ణయాలు బెడిసికొడుతాయి.
వృశ్చికం:
కుటుంబ సభ్యులు వ్యతిరేకంగా మారుతాయి. అనుకోని పర్యటన ఉండొచ్చు. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారుల పెట్టుబడులకు భవిష్యత్ లో లాభాలు వస్తాయి.
ధనస్సు:
కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఆకస్మిక ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారులకు మంచి ఫలితాలు ఉంటాయి.
మకర:
రచన రంగానికి చెందిన వారికి ప్రతికూల వాతావరణం. సోదరుల మధ్య సంబంధాలు మెరుగుపడుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
కుంభం:
శుభకార్యాల కోసం శుభవార్తలు వింటారు. సమాజంలో సీనియర్ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇతరులతో ఎక్కువగా కలిసి ఉండరు. అయితే ఈరోజంతా ఉల్లాసంగా ఉంటారు.
మీనం:
ఈ రాశి ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ వేస్తారు. కొన్ని పనుల వల్ల ఇతరులకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అందువల్ల చేసే ప్రతి పనిలో జాగ్రత్తలు వహించాలి.