https://oktelugu.com/

Horoscope Today : సర్వార్ధ సిద్ధియోగం కారణంగా.. ఈ రెండు రాశుల వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే..

వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు అధికంగా లాభాలు పొందుతారు. తండ్రి సలహా తీసుకొని కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2024 / 08:06 AM IST

    Horoscope Today(1)

    Follow us on

    Horoscope Today : గ్రహాల మార్పులో భాగంగా.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు సర్వార్ధ సిద్ధి యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరికొన్ని రాశుల వారికి రహస్య శత్రువుల బెడద ఉండనుంది. ఈ తరుణంలో మేషంతో సహా మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరులకు ధన సాయం చేస్తారు. తల్లి వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    వృషభరాశి:
    కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. ఇది సంతోషాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్లే అవకాశం. కుటుంబంతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

    మిథున రాశి:
    చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు లాభాలు పొందే అవకాశం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

    కర్కాటక రాశి:
    పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. ఉద్యోగులకు సీనియర్ల మద్దతు ఉంటుంది.

    సింహా రాశి:
    ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. కుటంబ సభ్యలకోసం ఖర్చులు చేస్తారు. వారి కోరికలను నెరవేరుస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    కన్యరాశి:
    వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే తల్లిదండ్రులను సంప్రదించాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. విద్యార్థులు తీసుకునే నిర్ణయం లాభిస్తుంది. ఉపాధి కోరుకునేవారికి ఇదే మంచి సమయం.

    తుల రాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఒత్తిడితో ఉంటారు. కొన్నిసమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. కుటుంబ సభ్యుల నుంచి విలువైన సలహాలు పొందుతారు.

    వృశ్చిక రాశి:
    సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీంతో మానసికంగా ఆందోళనతో ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.

    ధనస్సు రాశి:
    వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు అధికంగా లాభాలు పొందుతారు. తండ్రి సలహా తీసుకొని కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    మకర రాశి:
    భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కీలక పెట్టుబడులు పెడుతారు. తోబుట్టువుల వివాహం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. శుభకార్యక్రమాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి.

    కుంభ రాశి:
    ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు జీవిత భాగస్వామి ఇచ్చే సలహా ఉపయోగపడుతుంది. కొందరు శత్రువులు ఇబ్బందులకు గురి చేసే అవకాశం.

    మీనరాశి:
    ఆస్తి లావాదేవీలపై కీలక సమాచారం అందుకుంటారు. విద్యార్థులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు భాగస్వాములతో చర్చిస్తారు. మెరుగైన లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.