https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : అదిరిపోయిన ప్రేరణ బిగ్ బాస్ జర్నీ వీడియో..మగవాళ్ళతో సమానంగా ఆడే ఇలాంటి లేడీ కంటెస్టెంట్ మళ్ళీ రావడం కష్టమే!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎంతమంది ఆడవాళ్లు ఉన్నా, టాప్ 5 లోకి వచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రేరణ మాత్రమే. ఈమెని 'కిరాక్ బాయ్స్.

Written By:
  • Vicky
  • , Updated On : December 14, 2024 / 08:08 AM IST

    prerana

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎంతమంది ఆడవాళ్లు ఉన్నా, టాప్ 5 లోకి వచ్చిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రేరణ మాత్రమే. ఈమెని ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ లో జనాలు చూసినప్పుడే అనుకున్నారు, ఆమ్మో ఈ అమ్మాయి మామూలుది కాదు, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిందంటే మగవాళ్లకు కూడా చుక్కలు చూపిస్తుందని అనుకున్నారు. ఆమె ఎంట్రీ పై ప్రారంభం నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. ఆ అంచనాలను అందుకోవడం లో ప్రేరణ నూటికి 200 శాతం సక్సెస్ అయ్యింది. నిన్న ఆమె బిగ్ బాస్ జర్నీ ని మొత్తం చూపించినప్పుడు ఆమె అభిమానులకు మాత్రమే కాదు, ప్రేక్షకులకు కూడా గూస్ బంప్స్ వచ్చింది. ఒక పర్ఫెక్ట్ బిగ్ బాస్ జర్నీ అంటే, గౌతమ్ తర్వాత ప్రేరణదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈమె ఎక్కడా కూడా నటించలేదు. తన క్యారక్టర్ కి మాస్క్ వెయ్యలేదు.

    ఎంతమంది నీ నోటి దురుసు వల్ల నెగటివ్ అవుతున్నావ్ అని చెప్పినా, తన తీరుని మార్చుకోలేకపోయింది. కోపం వచ్చినప్పుడు ఆమె స్వభావాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అయ్యింది. దాని వల్ల ప్రేరణ ఎదురుకున్న నెగటివిటీ అంతా ఇంతా కాదు. మెగా చీఫ్ అయ్యాక, ఆమెపై ఏర్పడిన నెగటివిటీ ని చూసి విశ్లేషకులు ఈమె టాప్ 5 లోకి రావడం కూడా కష్టమే అని అనుకున్నారు. కానీ ఆడియన్స్ ఆమెకి ఎందుకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చారు అనేది, నిన్నటి AV వీడియో చూస్తే అర్థం అవుతుంది. నేను అమ్మాయిని, నా వల్ల కొన్ని పనులు అవ్వవు అని ఆమె అసలు అనుకోలేదు. ఆరోగ్యం సహకరించని రోజుల్లో కూడా టాస్కులు ఎగ్గొటెందుకు వాటిని సాకుగా వాడుకోలేదు. ఒక లేడీ టైగర్ గానే ఆమె ఆడింది. ప్రేరణ ని చూస్తే నామినేషన్స్ లో కానీ, టాస్కుల్లో కానీ మగవాళ్ళు సైతం వణికిపోయేవారు.

    అదంతా AV వీడియో లో చూపించారు. అయితే AV వీడియో చూసినప్పుడు యష్మీ విషయం లో ప్రేరణ సరైన రీతిలో స్పందించి ఉండుంటే ఈరోజు ఆమె టైటిల్ విన్నింగ్ రేస్ లో ఒక మెట్టు ముందు ఉండేది అని అనిపించింది. జర్నీ వీడియోలో ప్రేరణ కోసం యష్మీ స్టాండ్ తీసుకొని, ఆమెని ఎలా కాపాడింది అనేది చూపించారు. కానీ యష్మీ కష్టాల్లో ఉన్నప్పుడు ఈమె ఆమె కోసం స్టాండ్ తీసుకోవడం ఎప్పుడూ జరగలేదు. నామినేషన్స్ నుండి యష్మీ ప్రేరణ ని సేవ్ చేసిన రోజు, ప్రేరణ రిటర్న్ లో యష్మీ ని సేవ్ చెయ్యలేదు. అది కూడా చూపించారు. ప్రేరణకి ఇప్పటికైనా తాను యష్మీ విషయంలో తప్పు చేశాను అనే ఫీలింగ్ వచ్చి ఉండుంటే బాగుంటుంది అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె బిగ్ బాస్ జర్నీ కేవలం తన స్వార్థం కోసమే జరిగింది, స్నేహం పట్ల ఆమె విలువ చూపించి ఉండుంటే ఈరోజు కచ్చితంగా టైటిల్ రేస్ లో ఉండేది.