Horoscope Today: గ్రహాల మార్పు వల్ల రాశులపై ప్రభావం ఉంటుంది. ఇందులో భాగంగా సోమవారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు బ్రహ్మయోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి ఈశ్వరుడి ఆశీస్సులు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు శుభవార్తలు వింటారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇదివరకు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి ఈరోజు పొందుతారు. ఆర్థికంగా పుంజుకుంటారు. తల్లిదండ్రలు ఆశీర్వాదంతో కొత్త పెట్టుబడులు పెడుతారు.
వృషభరాశి:
మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే కష్టాలను ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి వేధింపులు ఎదుర్కొంటారు.
మిథున రాశి:
వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. ఏ పని మొదలు పెట్టినా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశం. ఇప్పుడు పెట్టే పెట్టుబడులు భవిష్యత్ లో లాభాలు ఇస్తాయి.
కర్కాటక రాశి:
కుటుంబంలో కొత్త సమస్యలు వస్తాయి. స్నేహితులతో కలిసి ఈ విషయాలను పంచుకుంటారు. దీంతో కొన్ని పరిష్కారం అవుతాయి. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఉద్యోగులు అన్నీ పనులు సక్రమంగా చేస్తారు.
సింహా రాశి:
రాజకీయ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు సీనియర్ల నుంచి ప్రశంసలు పొందుతారు.
కన్యరాశి:
కుటుంబ సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనవసర వివాదాల జోలికి వెళ్లకూడదు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరాలనుకుంటే ఇదే మంచి సమయం.
తుల రాశి:
విహార యాత్రలను వాయిదా వేసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొన్ని సమస్యలు నేటితో పరిష్కారం అవుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి.
వృశ్చిక రాశి:
శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయాలి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్త వింటారు.
ధనస్సు రాశి:
వ్యాపారులు కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. వీరికి శత్రువుల భయం ఎక్కువగా ఉంది. జీవిత భాగస్వామి అండతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.
మకర రాశి:
ఆర్థిక ఇబ్బందులు ఎదుక్కొంటారు. బంధువుల నుంచి ధన సాయం అందుతుంది. మహిళా ఉద్యోగులు కొత్త ఆదాయాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువ.
కుంభ రాశి:
విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. వాహనాలపై ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి:
గతంలో ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. అనారోగ్య కారణాల వల్ల ఇబ్బందులుఎదుర్కొంటారు. కటుుంబ సభ్యులతో కలిసి మెలిసి ఉండాలి. జీవితా భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.